సాధారణంగా పేలు ఒకరి నుండి మరొకరికి ఎక్కువగా వ్యాప్తిస్తూ ఉంటాయి.అయితే వీటి కారణంగా తలలో ఉండే ఇన్పెక్షన్ లు ఒకరి నుండి మరొకరికి వ్యాపించవు. రోగాలను వ్యాప్తి చేసే గుణం పేలకు లేదని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. అలాగే ఈ పేలు కేవలం 28 రోజులు మాత్రమే బ్రతుకుతాయి.ఇక ఆడ పేనుకు పది రోజుల వయసు వచ్చిన దగ్గర నుండి గుడ్లు పెట్టే యోగ్యత వస్తుంది.ఇంకా అలాగే ఆడపేను మగ పేనుతో కలిసిన 24 గంటల్లోనే గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది.ఇక ఒక ఆడ పేను రోజుకు 4 నుండి 5 గుడ్లు పెడుతుంది. ఆడ పేను తన
జీవిత కాలంలో 50 నుండి 125 గుడ్లు దాకా పెడుతుంది. ఒక గుడ్డు పేనుగా మారడానికి మొత్తం 8 రోజుల సమయం పడుతుంది. ఇంకా అలాగే ఈ గుడ్లు కింద పడిపోకుండా ఉండడానికి ఆడ పేను మన వెంట్రుకల మీద జిగురును స్రవించి ఆ జిగురుకు గుడ్లను అతికిస్తుంది. ఆ జిగురు కారణంగా గుడ్లు పిల్లలు అయ్యే దాకా ఊడిపోకుండా ఉంటాయి. ఇంకా అలాగే పేలు 55 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలవు.
55 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటిని పోసినప్పుడు ఆ పేలు చనిపోతాయి. చాలా మంది పేల సమస్య నుండి బయటపడడానికి చాలా రకాల షాంపులను, మందులను, లోషన్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలియదు కానీ సహజంగా లభించే
వేప నూనెను వాడడం వల్ల పేల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక
వేప నూనెలో అజాదిరిచిటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది పేలను నిర్మూలించడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.అందుకే పేల సమస్యతో బాధపడే వారు
వేప నూనెను జుట్టుకు బాగా పట్టించాలి.ఇక దీనిని ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత కుంకుడుకాయలతో శుభ్రంగా తల స్నానం చేయాలి. వేపనూనెను వాడిన ఒక్కరోజులోనే మనం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా
వేప నూనెను వాడడం వల్ల మనం చాలా సులభంగా పేల సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.