ఇక బార్లీ గింజలను ఎక్కువగా బీర్ తయారీలో వాడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.ఒక పాత్ర తీసుకొని అందులో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. ఆ తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో ఆ బార్లీ గింజలు మెత్తగా మారుతాయి. తరువాత వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. ఆ తరువాత ఆ నీటిని చల్లార్చి దాంట్లో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో చాలా అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు.బార్లీ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం రూపంలో ఈజీగా బయటికి వెళ్లిపోతాయి. ఇంకా అలాగే పెద్ద పేగు శుభ్రం అవుతుంది. అలాగే ఇది కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. బాగా వేడి చేసిన వారు బార్లీ నీటిని తాగడం వల్ల దాన్నుంచి ఈజీగా ఉపశమనం పొందుతారు. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం ఇంకా మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.ఈ బార్లీ నీటిలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లు, మోకాళ్ల నొప్పులను సులభంగా తగ్గిస్తాయి.
ఇక మధుమేహం సమస్య ఉన్న వారు బార్లీ నీటిని తాగడం చాలా మంచిది. ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ అనేది గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.అలాగే బార్లీలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను బాగా మెరుగు పరుస్తుంది. అందువల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకా గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ కూడా అదుపులో ఉంటుంది.గర్భంతో ఉన్న స్త్రీలు బార్లీ నీళ్లు తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.మీకు మూత్రాశయ సమస్యలు ఉంటే బార్లీ నీటిని నిత్యం తాగవచ్చు. మన కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బార్లీ నీటికి ఉంది.ప్రతి రోజూ బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. బాలింతలు బార్లీ వాటర్ నీళ్లు పాలు బాగా పడతాయి. అలాగే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే పోషకాలు శరీర మెటబాలిజంను ఈజీగా క్రమబద్దీకరిస్తాయి. అందువల్ల బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గాలనుకుంటే బార్లీ నీటిని ఉదయంతో పాటు సాయంత్రం కూడా తాగాల్సి ఉంటుంది.