జీలకర్రలో ఎన్నో రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీలకర్రను తీసుకోవడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటుగా జీలకర్రతో జీలకర్ర నీటిని తయారు చేసి తాగడం వల్ల ఎన్నో ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఒక గ్లాస్ జీలకర్ర నీటిని పరగడుపున తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జీలకర్ర నీటిని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. అలాగే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ప్రతి రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది.అందువల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఇంకా అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు జీలకర్ర నీటిని తాగడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.
ఇంకా అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.శరీరంలో మలినాలు ఇంకా విష పదార్థాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర నీరు ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇంకా అలాగే గొంతు నొప్పి, గొంతులో ఇన్పెక్షన్ వంటి శ్వాస సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల నాడీమండల వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. స్త్రీలు జీలకర్ర నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు కూడా తక్కువగా ఉంటాయి. ఇక మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జీలకర్ర నీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. పొద్దున్నే ఈ నీటిని వడకట్టి తీసుకోవాలి. ఇలా జీలకర్ర నీటిని తయారు చేసి తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.