పొద్దున్నే ఈ పండ్లు తింటే చాలా చురుగ్గా ఉంటారు?

Purushottham Vinay
మాములుగా పొద్దున పూట పండ్లు తినకూడదని చాలా మంది కూడా భావిస్తుంటారు. అయితే అది అన్ని పండ్లకు వర్తించదు. నిజానికి ఉదయం పూట తినదగిన ఆరోగ్యకరమైన పండ్లు కూడా కొన్ని ఉన్నాయి.అయితే ఆ పండ్లు ఏంటి..? పొద్దున పూట ఆ పండ్లని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి..? వంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.



బొప్పాయి పండు పొద్దున సమయంలో తినదగిన బెస్ట్ ఫ్రూట్.ఎందుకంటే ఈ బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అలాగే మన శరీరానికి అవసరమయ్యే మరెన్నో పోషకాలు ఈ బొప్పాయిలో నిండి ఉంటాయి. ఉదయం పూట ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తింటే రోజులో ఎక్కువ సమయం పాటు చాలా శక్తివంతంగా ఉంటారు. అలాగే నీరసం, అలసట వంటివి వేధించకుండా ఉంటాయి. పైగా బొప్పాయి పండు రక్తహీనత సమస్యని కూడా చాలా ఈజీగా తరిమి కొడుతుంది.అలాగే మీరు ఉదయం పూట ఏ పండు తినాలి అనుకుంటే ఖచ్చితంగా అరటి పండును తినవచ్చు.



ఎందుకంటే ఈ అరటి పండు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇంకా అలాగే అరటిపండు బోన్ హెల్త్ ను కూడా మెరుగుపరుస్తుంది. పైగా ఒత్తిడిని దూరం చేసి మెదడును చురుగ్గా మారుస్తుంది. ఉదయం పూట మీరు పుచ్చకాయను తీసుకోవచ్చు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎక్కువ శాతం మంది బాడీకి అవసరమయ్యే వాటర్ అందక చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు.అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో పుచ్చకాయ ముక్కలను కనుక తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. పైగా ఈ పుచ్చకాయ మైండ్ ఇంకా బాడీని కూడా రిఫ్రెష్ చేస్తుంది. అలాగే మనం చేసే పని పై ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే ఉదయం పూట యాపిల్ పండును కూడా తినొచ్చు. పోషకాలకు పవర్ హౌస్ అయిన ఈ యాపిల్ పండును ఉదయం పూట తింటే ఖచ్చితంగా రోజంతా చాలా చురుగ్గా ఉంటారు. ఇంకా అలాగే జీర్ణక్రియ యాక్టివ్ గా పని చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు కూడా చాలా ఈజీగా అదుపులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: