నల్లగా ఉన్న మెడను.. తెల్లగా కావాలంటే ఇలా చేయండి..!!

Divya
మన శరీరంలో ప్రతి ఒక్క అవయవము చాలా శుభ్రంగా అందంగా కనిపించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఫేస్ దగ్గర నుంచి పాదాల వరకు ప్రతి అవయవం కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలని చాలామంది పలు రకాల టిప్స్ సైతం ఫాలో అవుతూ ఉంటారు. చాలామందికి మెడ బాగం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.దీంతో ముఖం మెరిసినప్పటికీ మెడ నల్లగా పేరుకుపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ముఖం మీద పెట్టిన ఫోకస్ మెడ మీద పెట్టరు.. అయితే మెడ కూడా మెరవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.

మెడ మీద నల్లగా రావడానికి ముఖ్య కారణం చర్మం లో ph స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు చర్మం నల్లగా మారుతుందట. అలాంటి సమస్యకు చెక్ పెట్టాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ని చక్కగా ఉపయోగిస్తే సరిపోతుందట. ఇది చర్మం లోని మృత కణాలను సైతం దూరం చేసి సహజమైన మెరుపుని సైతం అందిస్తుంది. వీటిని తయారు చేసుకోవాలి అంటే కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకొని కాస్త నీటిలో వేసి బాగా కలిపిన తర్వాత తడి బట్టతో మెడ పైన అప్లై చేయాలి అలా పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేయడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది.
ఇక మరొక పద్ధతి ఏమిటంటే బంగాళదుంపలో ఎక్కువగా బ్లీచింగ్ పౌడర్ వంటి కణాలు ఉంటాయట. ఇది చర్మాన్ని షైనింగ్ వచ్చేలా చేస్తుంది. మెడపైన మచ్చలు మొటిమలు ఉన్నా సరే బంగాళదుంపను మధ్యలో కోసి తిట్టడం వల్ల వీటి నుంచి బయటపడవచ్చు.
ఇక మరొక పద్ధతి ఏమిటంటే బేకింగ్ సోడాను బాగా పేస్టులాగా చేసుకొని మెడ మీద పట్టించడం వల్ల చర్మం పైన ఉన్న మురికి దూరం చేసి లోపల చర్మం నుండి పోచకాలను పొందేలా చేస్తుంది. దీనివల్ల మెడ భాగం మెరుస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: