పాలిచ్చే తల్లులు ఈ ఆహారాలు తిన్నారంటే పిల్లల సంగతంతే..!
గర్భనిరోధక మాత్రలు..
కొంతమందికి డెలివరీ అయిన కొద్ది రోజులకే పీరియడ్స్ వచ్చి,ఆ క్రమంలోనే మరి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. వీటిని నివారించుకోవాలని కొంతమంది గర్భనిరోధక మాత్రలు పాలిస్తున్న సమయంలోనే వేసుకుంటూ ఉంటారు.ఇలా చేయడం వల్ల పిల్లలకు అ టాబ్లెట్ లో ఉన్న పవర్ఫుల్ కెమికల్స్ పడవని,వాటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తూ ఉన్నారు.
పుదీనా,కొత్తిమీర..
పుదీనా,కొత్తిమీర వంటి ఘాటు కలిగించే ఆకుకూరలు తినడం వల్ల,పిల్లల్లో ఇన్ఫలమేషన్ కలిగి శరీర దురద, జీర్ణక్రియ సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అధిక మసాలాలు..
పాలిచ్చే తల్లులు అధిక మసాలాలో ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల,వారికి గ్యాస్ ఉత్పత్తి కావడమే కాకుండా,పిల్లల్లో కూడా గ్యాస్ ఫార్మేషన్ అయి మలబద్ధకం,అజీర్తి వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
జంక్ ఫుడ్..
కొంతమంది పాలిచ్చే తల్లులు అవగాహన లోపంతో స్నాక్స్ సమయంలో జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటూ ఉంటారు.వీటివల్ల పిల్లల్లో అనవసరమైన కొవ్వులు చేరి, ఊబకాయం,అధిక బరువు,కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.అంతే కాక వారి ఎదుగుదల కూడా దెబ్బతింటుంది.
డైరీ పదార్థాలు..
కొన్ని డైరీ పదార్థాలు ఆరోగ్యానికి ఉపయోగపడితే మరికొన్ని డైరీ పదార్థాలు ఆరోగ్యానికి దెబ్బతీస్తూ ఉంటాయి.వాటిలో ముఖ్యంగా ఐస్ క్రీమ్,చీజ్,మయనిస్ కూల్ డ్రింక్ వంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల,పిల్లలకు కూడా జలుబు,దగ్గు,జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కావున పాలిచ్చే తల్లులు పైన చెప్పిన వాటికీ దూరంగా ఉంటూ,వారు తీసుకునే ఆహారంలో తగిన ప్రోటీన్, కాల్షియం ఉండేలా చూసుకోవాలి.