మొటిమలతో బాధపడేవారు ప్రతి రోజూ ఖచ్చితంగా 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా నీటిని తాగడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మన శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల కూడా మొటిమల సమస్య తలెత్తుతుంది. కాబట్టి ప్రతి రోజూ 4 లీటర్ల నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. సాయంత్రం విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలా పండ్ల జ్యూస్, బత్తాయి జ్యూస్ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి తేనెను రాసుకోవాలి.తేనెను తీసుకుని మొటిమలపై నెమ్మదిగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. మచ్చలు తొలగిపోతాయి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి మడ్ ప్యాక్ వేసుకోవాలి.
నల్లటి మెత్తటి మట్టిని తీసుకుని నీటిలో వేసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ మట్టిని తీసుకుని ముఖానికి రాసుకోవాలి. దీనిని ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల భాగానికి రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దీంతో ఈ భాగంలో వ్యర్థాలు తొలగిపోతాయి. చర్మ కణాలు ఆరోగ్యంగా తయారవుతాయి.మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. ఇంకా ఈ మొటిమలతో బాధపడే వారు చాలా మంది వీటిని గిల్లుతూ ఉంటారు. కానీ మొటిమలను గిల్లకూడదు. మొటిమలను గిల్లడం వల్ల ఆ భాగంలో మచ్చలు, గుంతలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అలాగే మొటిమలపై ఎక్కువగా రుద్దకూడదు. నెమ్మదిగా చేత్తో రుద్దాలి. అలాగే కాటన్ వస్త్రంతో నెమ్మదిగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి 5 నుండి 10నిమిషాల పాటు
ఆవిరి పట్టుకోవాలి. ఇలా
ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి.