ఈ సింపుల్ టిప్ తో పాదాల పగుళ్ళు మాయం?

Purushottham Vinay
ఈ సింపుల్ టిప్ తో పాదాల పగుళ్ళు మాయం ?


చాలా మందికి కూడా పాదాల పగుళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ పాదాల పగుళ్ల సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పాదాల పగుళ్లు రావటానికి శరీరంలో తేమ శాతం తగ్గటం, అలాగే విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉండటం ఇంకా అలాగే ఎక్కువ సేపు నిలబడి పనిచేయడం, వయసు పైబడడం,అధిక బరువు, సొరియాసిస్, ఎగ్జిమా, థైరాయిడ్, డయాబెటిస్ వంటివి కారణం అవుతాయి.ఈ సమస్యని తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.  పాదాల పగుళ్లను తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన పని కూడా లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. చాలా ఈజీగా పాదాల పగుళ్ళ సమస్య నుండి బయట పడవచ్చు.ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.



ఇక ఆవనూనెలో ఉన్న పోషకాలు చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది. అలాగే పగిలిన మడమలను నయం చేయడంలో సహాయ పడుతుంది. పాదాలను మృదువుగా ఇంకా చాలా అందంగా కనిపించేలా చేస్తుంది. అందువల్ల చాలా  సులభంగా పాదాల పగుళ్ళ నుండి బయట పడవచ్చు.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ ఆవనూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపి దాన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు.రాత్రి పడుకోవతానికి ముందు ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి సాఫ్ట్ గా మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే నెయ్యి, ఆవనూనె ఉండే లక్షణాలు పగిలిన పాదాలను మృదువుగా చేస్తాయి. ఈ విధంగా ప్రతిరోజూ చేస్తూ ఉంటే క్రమంగా పాదాల పగుళ్లు ఈజీగా తగ్గుతాయి. పైగా ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: