ఈ ఒక్క నూనెతో ఎంతటి మోకాళ్ల నొప్పునైన పరారయ్యేలా చేయండి..!

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లల్లో ఒకరి నుంచి ముగ్గురి వరకు మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు.ఇంకా కొంతమందికైతే మోకాలు మార్పిడి చేసి, ఐరన్ రాడ్ల ఉంచి మరి చికిత్స చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారి నొప్పులు మాత్రం తగ్గకుండా ఉన్నాయి.

అసలు మోకాళ్ళ నొప్పులకు ఎక్కువ రావడానికి కారణం వారి శరీరం అధిక బరువు పెరగడం మరియు వెస్ట్రన్ స్టైల్ ఫ్లోర్లపై నడవడం,స్త్రీలు ఎక్కువసేపు నిలబడి వంట చేయడం వంటి సమస్యల వల్ల మోకాళ్ళ తొందరగా అరుగుతూ ఉన్నాయి.ఇది క్రమక్రమంగా పెరిగి,మోకాళ్ళ నొప్పులు ఎక్కువై,చివరికి మోకాల మార్పిడికి గురవుతున్నారు.అలా కాకుండా మోకాళ్ళ నొప్పి వచ్చిన మొదట్లోనే  ఈ ఒక్క నూనెతో రోజు మర్దన చేసుకోవడం వల్ల నొప్పిని పరార్ చేయించి,వారు తిరిగి పరిగెత్తేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఆ నూనె ఏంటో,ఎలా రాసుకోవాలో తెలుసుకుందాం పదండీ..

దీనికోసం ముందుగా నువ్వుల నూనె తీసుకొని, అందులో మూడు నుంచి నాలుగు యూకలిప్టస్ ఆకులను వేసి స్టవ్ పై ఉంచి బాగా మరిగించాలి.అలా వచ్చిన నునేను ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ ఆయిల్ ని మోకాలు నొప్పులు ఉన్నవారు పొద్దున,సాయంత్రం మోకాళ్లకు మర్దన చేయాలి.ఆ తర్వాత వేడినీళ్లతో కాపడం పెట్టాలి.ఇలా రోజు చేయడంతో వారం రోజుల్లోగా నొప్పికి ఉపశమనం కలుగుతుంది.

యూకలిప్టస్ ఆకుల్లో ఉన్న ఫిలోలిక్ యాసిడ్స్ నరాల నుంచి నొప్పి లోపలికి పోకుండా అడ్డుకొని,నొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా కండరాలు బలంగా తయారవడానికి కూడా ఉపయోగపడుతుంది.మరియు నువ్వుల నూనె ఇన్ఫ్లమేషని తగ్గిస్తుంది.దీనితో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు గరుకుతలం లేదా గడ్డి పోచల పైన అరగంట నుండి గంట సేపు నడవడం, అధిక బరువును తగ్గించుకోవడం,ఎక్కువ సేపు నిలబడకుండా ఉండడం,ఒకవేళ నిలబడాల్సి వస్తే ప్రతి పదినిముషాలకు ఒక సరి కూర్చొని మళ్ళీ నిలబడడం వంటి జాగ్రత్తలను పాటించాలి.మరియు క్యాలిషియం అధికంగా ఉన్న ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: