చలికాలంలో ముఖాన్ని మెరిపించే ఆయిల్సివే..!

Divya
చలికాలం వచ్చిందంటే చాలామంది వారి స్కిన్ కేర్ విషయంలో తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎందుకంటే వారికి కి తొందరగా బ్రేకౌట్స్ కావడం,చర్మం పొడిబారడం,అధిక మొటిమలు రావడం, మృతకణాలు ఏర్పడడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతూ ఉంటారు.అలాంటివారు వేలకు వేలు ఖర్చు చేసి,రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడి,అయినా పెద్దగా ఫలితం లేక వాటిని ఎలా పోగొట్టుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటారు.అలాంటి వారి కోసం నేచురల్ గా దొరికే కొన్ని రకాల ఆయిల్స్ ని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి చర్మ సమస్యలు ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయని పరిశోధనలు చేసి మరి నిరూపిస్తున్నారు.అసలు మన స్కిన్ కేర్ విషయంలో ఎటువంటి ఆయిల్స్ ఉపయోగపడతాయో మనము తెలుసుకుందాం పదండి..
కొబ్బరి నూనె..
రోజు పడుకోబోయే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేసి మర్దన చేసుకోవడం వల్ల,రక్త సరఫరా పెరిగి ముఖంలో ఎటువంటి చర్మ సమస్యలు ఉన్నా కూడా తొందరగా తొలగించే గుణం ఉంటుంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల చర్మం తేమగా ఉండడమే కాకుండా ఎటువంటి బ్యాక్టీరియా నైనా తొందరగా తొలగిస్తుంది.
విటమిన్ ఈ ఆయిల్..
విటమిన్ ఈ కలిగిన ఆయిల్ ని అప్లై చేసుకోవడం వల్ల,చర్మంపై బ్రేకౌట్స్ తొందరగా తొలగిపోతాయి.మరియు చర్మం నున్నగా మెరుపును సంతరించుకుంటుంది.కావున ఎవరైనా మృతకణాలు,మొటిమలు,మచ్చలను తొందరగా తొలగించుకోవాలి అంటే వెంటనే విటమిన్ ఈ కలిగిన ఆయిల్స్ అప్లై చేయడం అలవాటు చేసుకోండి.
రోజ్ మేరీ ఆయిల్..
రోజ్ మేరీ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ సమస్యలను పోగొట్టడమే కాక ఆరోగ్య సమస్యలను కూడా వేగవంతంగా తొలగిస్తుంది.దీనిని తరచూ తీసుకోవడంతో దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం,గుండె జబ్బులు,కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తొందరగా తొలగిపోతాయి.
నువ్వుల నూనె..
పూర్వం రోజుల్లో నువ్వుల నూనెతో తలంటు పెట్టుకుని స్నానాల ఆచరించేవారు.దీనికి కారణం ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల చర్మ సమస్యలను పోగొట్టడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది కనుక. అవును చర్మ సమస్యలు కలవారు ఈ నూనెను నిర్భయంగా వాడొచ్చు.కావున మీరు కూడా చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ ఆయిల్ అప్లై చేయడం అలవాటు చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: