గ్యాస్ సమస్యని చిటికెలో తగ్గించే టిప్స్?

Purushottham Vinay
గ్యాస్ సమస్య నుండి సులభంగా బయటపడడానికి మనలో చాలా మంది కూడా మందులు వాడుతూ ఉంటారు. ఇంకా సిరప్ లను, పౌడర్ లను తాగుతూ ఉంటారు. అయితే వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సమస్యతో బాధపడే వారు మందులు, సిరప్ లను వాడడానికి బదులుగా ఇప్పుడు చెప్పే టిప్స్ ని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.గ్యాస్ సమస్యతో బాధపడే వారు తినేటప్పుడు నీటిని తాగడం మానేయాలి. తిన్న రెండు గంటల తరువాత నీటిని తాగాలి. తినేటప్పుడు నీటిని తాగడం వల్ల గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది. సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.గ్యాస్ సమస్యతో బాధపడే వారు తిన్న రెండు గంటల తరువాత నీటిని తాగడం మంచిది. అలాగే భోజనానికి భోజనానికి మధ్యలో ఏ ఇతర ఆహారాలను తీసుకోకూడదు. ఎప్పుడుపడితే అప్పుడు ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి.



అలాగే మనం తీసుకునే ఆహారాలు చప్పగా, ఉప్పు, కారం లేకుండా చూసుకోవాలి. సమస్య తగ్గే వరకు ఇలా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా సాయంత్రం భోజనంలో పండ్లను తీసుకోవాలి. వీటిని కూడా సాయంత్రం 6 నుండి 7 గంటల లోపే తీసుకునే ప్రయత్నం చేయాలి.గ్యాస్ సమస్యతో బాధపడే వారు రోజూ సుఖ విరోచనం అయ్యేలా చూసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున లీటరు నుండి లీటర్నర నీటిని తాగాలి. నీటిని తాగడం వల్ల విరోచనం సులభంగా అవుతుంది. అలాగే టీ, కాఫీలను తాగడం మానేయాలి. వీటిని తాగడం మానేయడం వల్ల గ్యాస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే గ్యాస్ సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా తియ్యటి పండ్లను తీసుకోవాలి. పండ్లను తీసుకోవడం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి. గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: