గోవా వెళ్లే వారికి.. ఇంతకన్నా గొప్ప తీపి కబురు ఉంటుందా?

praveen
గోవా.. ఈ పేరు చెబితే చాలు ఏదో తెలియని వైబ్రేషన్. యూత్ అందరికీ అదో స్వర్గం. జీవితంలో ఒక్కసారి అయినా ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని అందరికీ ఆశ. ఈ క్రమంలోనే గోవా లాంటి ప్రపంచంలోకి వెళ్లేందుకు ఎన్నో రోజులుగా ప్లాన్లు వేసుకుంటారు. ఎన్ని ప్లాన్లు వేసుకున్న అవి మాత్రం విఫలమవుతూనే ఉంటాయి. అందుకే కేవలం కొంతమంది మాత్రమే గోవా వెళ్లాలి అనే కలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే గోవా ఏ టైంలో వెళ్లాలి ఎలా వెళ్లాలి అనే విషయంపై ఎప్పుడు అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి.

 ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకోవడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వెతికిస్తూ ఉంటారు అని చెప్పాలి  కొన్ని కొన్ని సార్లు మనం ఉండే చోటు నుంచే గోవా వెళ్లడానికి ఏదైనా ప్రయాణ మార్గం ఉంటే బాగుండు రైలు లేదా బస్సు లేదంటే ఫ్లైట్ నుంచి ఎంతో ఈజీగా గోవాకి వెళ్లే వాళ్ళం కదా అని ఎంతో మంది యూత్ అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే వర్షాకాలంలో గోవాకు వెళ్లడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక గోవాకి వెళ్లే మార్గంలో  ఉండే ఎన్నో జలపాతాలు ప్రకృతి విందును అందజేస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఇలా గోవా వెళ్లాలి అనుకునే వారికి ఇక ఇప్పుడు ఒక అద్భుతమైన తీపి కబురు అందింది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా గోవాకు కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు 17039/17040 ను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు బుధ శుక్రవారం లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇక గురు శనివారాల్లో వాస్కోడిగామా నుంచి మళ్లీ సికింద్రాబాద్కు బయలుదేరుతుంది. కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్ గుంతకల్ తదితర స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: