మెదడి గ్రోత్ ని పెంచే పనులు ఇవే..!
అయితే ఆ విస్టును పేపర్ పై రాసుకు వెళ్లటం మానేయండి. వాటన్నింటివి గుర్తుంచుకొనే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొత్త భాష నేర్చుకోవటం వల్ల మెదడుకు పని పెట్టినట్లు అవుతుంది. దీనివల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒక కొత్త భాషను నేర్చుకోవడం వల్ల మెదడుకు ఆరోగ్యంగా ఉంటుందంట. మెదడుకు పని పెట్టాలండే లెక్కలు తెలియాల్సిందే. మీకు రోజు వారీగా ఎదురయ్యే లెక్కలు చేయాల్సి వచ్చినప్పుడు మెదడుకు పదును పెట్టండి. పెన్, పేపర్, కాలిక్యులేటర్ సహాయం లేకుండా లోలోపలే కూడికలు, తీసివేతలు చేయండి. దీనివల్ల మెదడుకు వ్యాయామం అందుతుంది.
మెదడుకు సరైన వ్యాయామం చదవడం. జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకోవడానికి చదవడం అలవాటుగా మార్చుకోవడం చాలా అవసరం . దీనివల్ల మీ మెదడు పదునుగా మారుతుంది. చెయ్యితో పాటు కంటి చూపుతో చేసే పనులు ఎక్కువగా చేయండి. బొమ్మలు వెయడం, పెయింటింగ్, రాయడం, వీడియో గేమ్ వంటివి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంట్లో లేదా బయటకు వెళ్ళినప్పుడు ఆహారం తింటుంటారు కదా. అందులో ఏ పదార్థాలు, అవి ఏ రుచిలో ఉన్నాయో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వాటిలో వాడిన మసాలాలతో సహా ఎక్కువ పదార్థాలు గుర్తుంచుకోవటం వల్ల మెదడుకు మేలు జరుగుతుంది. కొత్త భాష నేర్చుకోవటం వల్ల మెదడుకు పని పెట్టినట్లు అవుతుంది.