ఈ కూరగాయ తింటే అంతులేని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది?

Purushottham Vinay

కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. అందులో బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. ఇది ఫైబర్, పొటాషియం, ప్రోటీన్లకు మంచి మూలం. అందుకే దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అధిక బరువు తగ్గడానికి, ఖచ్చితంగా బ్రోకలీ సలాడ్ లేదా సూప్ తాగితే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. డైటింగ్ చేస్తూ బ్రకోలీ తింటే ఊబకాయం ఈజీగా తగ్గుతుంది. అలాగే బ్రకోలీ తినడం వల్ల కాలేయం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్, హెపాటోప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంలో బ్రోకలీ ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో కాల్షియం లోపాన్ని తొలగిస్తుంది. బ్రోకలీలో కాల్షియం చాలా పుష్కలంగా లభిస్తుంది, ఇది ఎముకలను బాగా బలపరుస్తుంది. బ్రోకలి లాంటి ఆరోగ్యకరమైన ఆకుపచ్చని కూరగాయలు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుందట. గుండెజబ్బులు, క్యాన్సర్ ఇంకా బీపీ ని ఇవి అడ్డుకుంటాయి. ఈ బ్రోకలీ ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కూరగాయ. 


రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే జింక్, సెలీనియం, విటమిన్ ఎ ఇంకా సి వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. బ్రోకలీలో పాలీఫెనాల్, క్వెర్సెటిన్ ఇంకా గ్లూకోసైడ్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి. ఈ బ్రోకలీని సూప్ లేదా సలాడ్‌గా కూడా ఉపయోగించవచ్చు. మధుమేహ రోగులు తప్పనిసరిగా ఈ ఆకుపచ్చ కూరగాయలను తినాలి. అందులో బ్రకోలీ కూరగాయని తినడం వల్ల బ్లడ్ షుగర్ ఈజీగా అదుపులో ఉంటుంది. దీనివల్ల ఊబకాయం సమస్య పెరగదు. పైగా ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులో విటమిన్ సి, జింక్ బ్రోకలీలో మంచి పరిమాణంలో ఉంటాయి.


ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇక తెల్ల క్యాబేజీకి బదులుగా మార్కెట్లో ఆకుపచ్చ క్యాబేజీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రకం క్యాబేజీని బ్రోకలీ అని అంటారు.పైగా ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన కూరగాయగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.ఈ బ్రోకలీ వైట్ క్యాబేజీ కంటే చాలా రెట్లు ఎక్కువ పోషకాలు కలిగింది. ఇందులో ఫైబర్‌ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది ఊబకాయాన్ని ఈజీగా తగ్గిస్తుంది. మన శరీరంలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ల లోపాన్ని తీర్చడానికి బ్రొకోలీని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: