భార్య భర్తలు ఇలా చేస్తే కలకాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు?

Purushottham Vinay

ఆఫీసులో మగాళ్లు, ఇంట్లో ఆడవాళ్లు నిత్యం ఎన్నో పనులతో శారీరకంగా మానసికంగా బాగా అలిసిపోతూ ఉంటారు.పైగా వీటికి తోడు ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కూడా చాలా రకాలుగా ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అయితే రాత్రిపూట మనం పడుకునే పొజిషన్స్ ద్వారా కూడా మనం స్ట్రెస్ నుంచి అలాగే ఇంకొన్ని సమస్యల నుంచి ఈజీగా బయట పడవచ్చట. రాత్రుళ్ళు నిద్రపోయేటప్పుడు ఒకొక్కరు ఒకొక్కలాగా పడుకుంటూ ఉంటారు.. కొంతమంది బోర్లా తిరిగి పడుకుంటారు. మరికొంతమంది అయితే ఎల్లికల తిరిగి పడుకుంటారు.. ఇంకొంతమంది అయితే ఓ పక్కకు తిరిగి పడుకుంటారు. అయితే ఇలా కౌగిలించుకొని పడుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి అంటున్నారు కొంతమంది ఆరోగ్య నిపుణులు,  వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మనం మన పార్ట్నర్ ను కౌగిలించుకొని పడుకోవడం వల్ల ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా లాభాలు ఉంటాయట. మన భార్యాభర్తలు కౌగిలించుకోని పడుకుంటే శరీరంలో ఆక్సీటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందని తెలిసింది. ఇక దాని ద్వారా భార్య భర్తలు కలకాలం ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా అంతే కాదు మన పార్ట్నర్ ను కౌగిలించుకొని పడుకోవడం వల్ల రాత్రి మొత్తం కూడా హాయిగా నిద్రపోతారట.ఇలా కౌగిలించుకోని పడుకోవడం వల్ల నిద్ర పట్టకపోవడం లాంటి సమస్య ఉండదు అంటున్నారు. అంతే కాదు హగ్ చేసుకొని పడుకోవడం వల్ల మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుందట.


హాగ్ చేసుకొని పడుకుంటే ఒత్తిడి, ఆందోళన ఈజీగా తగ్గుతుందట. దాని వెళ్లి హాయిగా నిద్రపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా అలాగే ఉదయాన్నే చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారట. హగ్ చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగు పడుతుందట. కౌగిలించుకోని పడటం వల్ల హార్ట్ బీట్ వేగం తో పాటు రక్తపోటు కూడా కంట్రోల్ అవుతుందట. ఎవరైనా ఒత్తిడిలో లేదా ఆందోళనలో ఉన్న వారిని హాగ్ చేసుకుంటే అది వారికి ఖచ్చితంగా ఊరటను ఇస్తుంది.ఇంకా వీటితో పటు కౌగిలించుకోవడం అనేది ప్రేమను వ్యక్తపరచడానికి చక్కని మార్గమట. దాని వల్ల మనం ఎంత ప్రేమిస్తున్నామో అవతలి వారికి సులభంగా అర్ధమవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: