ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తీసుకోక పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వాటిని తీసుకోవడం వల్ల చాలా మందికి కూడా గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం రాత్రి భోజనం చేసిన తరువాత నుండి ఉదయం వరకు ఆహారం ఏమీ తీసుకోము. పొద్దున్నే ఖాళీ కడుపు కారణంగా జీర్ణవ్యవస్థ వేగం మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని ఆహారాలు ఉదయాన్నే తీసుకుంటే కడుపులో ఖచ్చితంగా గ్యాస్ అనేది ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆ ఆహారాలు ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి చేసేవి కావడమే. దీనివల్ల పొట్టలో యాసిడ్ లెవల్స్ బాగా పెరుగుతాయి. అందుకే ఉదయం పూట ఇప్పుడు చెప్పే ఆహారాలు తీసుకోవడం మానేస్తే గ్యాస్ సమస్యని ఈజీగా నివారించవచ్చు.
పచ్చి ఉల్లిపాయ అస్సలు తీసుకోకూడదు.
కొంతమంది ఉదయాన్నే పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తింటారు. దీని వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. దీనికి కారణం ఏంటంటే ఉల్లిపాయలో ఉండే కొన్ని మూలకాలు. ఈ ఉల్లిపాయలో ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఇది జీర్ణం కావడం చాలా కష్టం. ఇంకా అంతే కాకుండా ఇందులోని ఫ్రక్టోజ్ గ్యాస్ సమస్యలను కూడా మనకు కలిగిస్తుంది. అలాగే కాఫీ.. కొంతమందికి ఖాళీ కడుపుతో కాఫీ ఇంకా టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగితే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కాఫీ అనేది కడుపులో యాసిడ్ లెవెల్స్ పెంచుతుంది.
అలాగే ఉదయాన్నే చాలా మంది కూడా టమోటాలు తినడం ఇంకా టమోటా జ్యూస్ తాగడం చేస్తుంటారు. అయితే టమోటాలలో అధిక మొత్తంలో టానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అందువల్ల ఇది కడుపులో ఆమ్లతత్వం, పుల్లని త్రేన్పులు కలిగిస్తుంది. అందుకే ఈ టమోటాలు ఉదయాన్నే తినేవారు ఎక్కువ ఎసిడిటీ సమస్యలు కలిగి ఉంటారు. అలాగే ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమోటా తినకూడదు. ఉదయం పూట లేచి బ్రష్ చేసిన వెంటనే పాలు తాగడం కొందరికి అలవాటు. అయితే వేడి వేడి పాలు ఇంకా పాల ఉత్పత్తులు తీసుకుంటే కడుపులో యాసిడ్స్ పెరుగుతాయి. కాబట్టి ఉదయం ఇలాంటి ఆహారాలు తీసుకోకూడదు.