వర్షాకాలంలో దుస్తులు డ్రై అవ్వడం లేదా?.. ఈ విధంగా చేయండి..!వర్షాకాలంలో దుస్తులు డ్రై అవ్వడం లేదా?.. ఈ విధంగా చేయండి..!
దుస్తులన్నిటిని ఒకేసారి ఉతక వద్దు. ఒకేసారి ఉతకడంతో దుస్తులు ఆరబెట్టడానికి ప్లేసు సరిపోదు. ముందుగా కొన్ని బట్టలు వాష్ చేసి, వాటిని ఆరబెట్టి ఆ తరువాత మిగతా వాటిని వాష్ చేయాలి. వర్షం బాగా పడుతుంటే దుస్తులను ఫ్యాన్ కింద ఆరేయడం మంచి పద్ధతి. దీని వలన దుస్తులు త్వరగా డ్రై అవుతాయి. తడి దుస్తులు తక్షణమే ఆరాలంటే ఐరన్ చేయవచ్చు. అయితే మరీ మరీ తడిగా ఉన్న దుస్తులను ఐరన్ చేయకండి. అత్యవసర పరిస్థితుల్లో హెయిర్ డ్రైయర్ వాడి కూడా దుస్తుల్ని డ్రై చేయవచ్చు.
లో దుస్తులు, చిన్నచిన్న దుస్తులను ఆరబెట్టేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. మీ వాషింగ్ మెషిన్ లో స్పిన్ సైకిల్ ఆప్షన్ ఉంటే ఆప్షన్ ను ఉపయోగించి దుస్తులలో ఉండే నీటిని తొలగించండి. ఆ తర్వాత దుస్తులను ఆరవేయండి. ఉతికిన దుస్తులను టవల్ లో ఉంచి పిండడంతో దుస్తుల్లో ఉండే నీరు పోతుంది. ఆ తర్వాత దుస్తులను ఆరబెడితే అవి త్వరగా డ్రై అవుతాయి. మీ ఇంట్లో గాలి బాగా వీచే కిటికీరా దగ్గర ఇండోర్ డైయింగ్ ర్యాక్స్ ఏర్పాటు చేయండి. వీటిపై దుస్తులను ఆరబెడితే త్వరగా డ్రై అవుతాయి. మీరు కూడా ఈ పద్ధతుల్లో దుస్తులను ఆరబెట్టుకోండి.