మటన్ లో ఏ ఏ పార్ట్స్ దేనికి పనిచేస్తాయో తెలుసా..?
జలుబు, ఎముకలు పెరగటం వంటి సమస్యలున్న వారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది అని అంటున్నారు వైద్యులు. అలాగే తరచూ మటన్ బోన్స్ తీసుకుంటే రక్తం లో హిమోగ్లోబిన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది. ఎముకలను బలపరుస్తుంది. మేక తలకాయలో ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కాల్చి..దీనిని మొక్కలుగా చేసి కూర వండుకుని చపాతి, లేదా రైస్ లో తింటుంటారు. రెడ్ మీట్ ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అనే చెప్పవచ్చు.
తలకాయ కూర తింటే..శరీరం గట్టిపడుతుంది. మటన్ బోటీ అంటే పేగులలో విటమిన్ ఎ, బి12, డి, ఈ, కె ఫ్రై చేసుకుని తింటే మన పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వారానికి ఒక్కసారి మటన్ తింటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మటన్ వేయించడం , గ్రిల్ చేయటం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా మటన్ సూపును తప్పకుండా తాగండి. త్రాగటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ మటన్ లో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి మటన్ ను వారానికి ఒక్కసారి అయినా తప్పకుండా తినండి. ఈ మటన్ తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.