అంజీర్ పండు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిని నీళ్లలో నాన బెట్టి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, మెగ్నిషీయం, ఫాస్పరస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మన ఎముక ఆరోగ్యానికి చాలా మంచిది. ఆస్టియోపోరోసిస్ రాకుండా మన ఎముకలను అంజీర్ పండు కాపాడుతుంది. అంజీర్ పండ్లను పిల్లలకు తరచూ తినిపించటం వల్ల వారి ఎముకలు చాలా బలంగా మారతాయి. డయాబెటిస్ ఉన్నవారికి తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంజీర్ పండును తినవచ్చు. ఈ పండు రుచి తీయగా ఉంటుంది. కానీ, మన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. అయితే దీన్ని వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు.అంజీర్‌లో పాలీఫెనల్స్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంజీర్ పండులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన కడుపును ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటుని మీ నుంచి దూరంగా ఉంచుతుంది.
దాని ఫలితంగా మనం క్యాలరీలు తక్కువగా తీసుకున్నట్లవుతుంది. అందువల్ల అధిక బరువు పెరగరు.అంజీర్‌లో ఎన్నో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కే, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉండటం వల్ల ఇవి మన శరీర పనితీరుకు ఎంతో ఆరోగ్యకరం. అంజీర్ పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది.ఇందులోని ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్ పెడతాయి.అంజీర్‌లో పాలీఫెనల్స్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంజీర్‌లోని డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. దీనిలోని విటమిన్ ఎ,సి,ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసి స్కిన్‌కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్‌ను రోజూ తింటే జుట్టుకు చాలా మంచిది.