టమాటాలు ఎక్కువ తింటే కలిగే నష్టాలు ఇవే?

Purushottham Vinay

టమాటా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కూరలు ఇది లేనిదే అవ్వవు. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది టమాట సాస్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటును అమాంతం పెంచుతుంది. అలాగే టొమాటో సూప్ లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. టమోటాలు అలెర్జీ ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి అలెర్జీ సమస్యలను పెంచుతాయి. టమాటాలు అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. టమోటాల్లో అధిక ఆమ్లంగా ఉండటం వల్ల.. మీరు ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడుతుంటే అవి తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తాయి. టమోటాల్లో కడుపులో ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి.టమాటాలను తిన్న వెంటనే కొంతమందికి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు, తామర, దగ్గు, గొంతులో దురద, ముఖం, నోరు, నాలుక వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుబొమ్మలు, రెప్పల చుట్టూ ఎర్రగా కనిపిస్తుంది. 


మూత్రపిండాల సమస్యలున్నవారు టమోటాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధికి దారితీసే కారకాల్లో ఒకటైన పొటాషియం స్థాయిలను టమోటాలు పెంచుతాయి. టమాటాలో హిస్టమిన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపించి, ఆర్థరైటిస్‌ లాంటి సమస్యల్ని తీవ్రతరం చేస్తుంది.ఇక మనం టమాటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇందులోని సాల్మొనెల్ల బ్యాక్టీరియా డయేరియా సమస్యకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమాటోలను ఎక్కువగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు టమాటాలకు కచ్చితంగా చాలా దూరంగా ఉంటే మంచిది. టమోటాలు, వాటి తొక్కలు, విత్తనాలు కూడా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు ఒక కారణం కావచ్చంటున్నారు నిపుణులు.మీకు ఇప్పటికే ఐబిఎస్ ఉంటే టమాలను తీసుకోకపోవడమే మంచిది. ఇవి కడుపు ఉబ్బరాన్ని ఎక్కువ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: