స్నానానికి ముందు జుట్టుకు నూనె రాయడం వల్ల.. క్షేమమా? ప్రమాదమా..?
కానీ నూనెను అప్లై చేసే సరైన పద్ధతి తెలుసుకోవడం ముఖ్యం. మీరు మీ జుట్టుకు నూనె రాయాలనుకుంటే తల స్నానానికి ముందు అప్లై చేయండి. తల స్నానానికి కనీసం 1 గంట ముందు తలకు పట్టించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత తలస్నానం చేయటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జుట్టు రాలడం, డల్ హెయిర్ సమస్యలను నయం చేస్తుంది . స్నానం చేయటానికి ముందు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల రక్షత పోరా ఏర్పడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి .
జుట్టుకు నూనె రాయటం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ స్నానం చేసే ముందు జుట్టుకు నూనె రాసుకోవడం మంచిది . అలా రాసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది . రాలటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి . చాలామంది స్నానం చేసిన తరువాత నూనెను రాస్తూ ఉంటారు . అలాకాకుండా స్నానం చేసే ముందు రాసుకుని 1 గంట ఉంచుకుని తర్వాత స్నానం చేయటం మంచి పద్ధతి . అలా చేయటం వల్ల మీ జుట్టు పొడిబారి పోకుండా ఉంటుంది . రాలటం, చుండ్రు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి .