రాత్రిపూట దుస్తులు లేకుండా పడుకోవడం.. మంచిదా.. చెడ్డదా..?

Divya
చాలామంది రాత్రి పడుకునే సమయంలో బట్టలు లేకుండా (నగ్నంగా) పడుకోవడానికి మక్కువ చూపుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో ఇలా చాలామంది చేస్తూ ఉంటారు.అయితే ఇలా నగ్నంగా పడుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం చాలామందికి తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ప్రముఖ డాక్టర్ ఆంథోని ఒక వీడియోలో ఇలా పడుకోవడం వెనుక ప్రమాదం గురించి తెలియజేశారు.

దుస్తులు లేకుండా పడుకోవడం అనేది అపరిశుభ్రమని కూడా తెలిపారు. అందుకు పెద్ద కారణం అపానవాయువెనట. సగటున మనిషి 15 నుంచి 25 సార్లు.. అపానవాయువు చేస్తూ ఉంటారట. మనం నిద్రపోతున్నప్పుడు ఇది జరుగుతూనే ఉండేటువంటి ప్రక్రియ అన్నట్లుగా తెలిపారు. మన గ్యాస్ ని పాస్ చేస్తున్న సమయంలో కాస్త మల పదార్థాలు కూడా బయటికి వదిలేస్తూ ఉంటాయని శాస్త్రీయపరంగా నిరూపించబడిందని తెలిపారు.ఈ అపానవాయువు  మనం నిద్రిస్తున్నప్పుడు మంచం మీద వదిలేస్తూ ఉంటాము. అయితే దీనివల్ల ఎలాంటి అపాయం లేదు కానీ.. మీ భాగస్వామి శరీరానికి తాకడం వల్ల చాలా ప్రమాదము. దీనివల్ల అనేక జబ్బులు కూడా వస్తాయట. అందుకే లో దుస్తులు ధరించి నిద్రపోవాలని తెలియజేస్తున్నారు వైద్యులు. అలాగే ప్రతిరోజు కూడా  మారుస్తూ ఉండాలని తెలియజేశారు.

ఇక లాభాల విషయానికి వస్తే..నగ్నంగా పడుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గిపోయి నిద్ర కూడా త్వరగా పట్టేలా అంతేకాకుండా ఎలాంటి ఒత్తిడి నైనా సరే వెంటనే తగ్గించేలా చేస్తుందట. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా దూరం చేస్తుందట. నగ్నంగా పడుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్లు సైతం నియంత్రణలో ఉంటాయట.. జుట్టు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందట. అందం కూడా మరింత రెట్టింపు అవుతుందట. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందట. అయితే నిద్రించడం కంటే తేలికైన బట్టలు వేసుకొని పడుకోవడం ఉత్తమని సైతం తెలియజేస్తున్నారు. అయితే కొంతమందికి మాత్రం దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది.. అలాంటివారు డబ్బులు వేసుకొని పడుకోవడమే ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: