భారతదేశంలోనే అత్యంత అందమైన హిల్ స్టేషన్లు.. ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలనిపించదు..??

frame భారతదేశంలోనే అత్యంత అందమైన హిల్ స్టేషన్లు.. ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలనిపించదు..??

Suma Kallamadi
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు చదువు, పని, వివిధ రకాల బాధ్యతల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే సెలవులు దొరికినప్పుడు ప్రకృతి దేశాలకు వెళ్లడం ద్వారా ఆ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా కొన్ని హిల్ స్టేషన్లకు వెళ్తే మనసుకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. భారతదేశంలో అత్యంత అందమైన హిల్ స్టేషన్లు కొన్ని ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలనిపించదు. అంత బాగుంటాయి అవి ఏవో తెలుసుకుందాం.
 
* ధర్మశాల:
పర్వతాల మధ్య ఉన్న అందమైన ప్రదేశాల గురించి మాట్లాడుకునేటప్పుడు, మనకు ముందుగా గుర్తుకు వచ్చే చోట్లలో ధర్మశాల ఒకటి. హిమాలయ పర్వతాల అందమైన లోయల్లో ఉండే ధర్మశాల, మన దేశస్తులకే కాకుండా విదేశీ ప్రయాణికులకు కూడా చాలా ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ చూడడానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, నంగ్యల్ మఠం, భాగ్సునాగ్ జలపాతం, త్రియుండ్ ట్రెక్, దాల్ లేక్, సెయింట్ జాన్స్ చర్చి. అడ్వెంచర్ చేయాలనుకునే వారికి మక్లీడ్‌గంజ్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
కసౌలి
సముద్ర మట్టానికి దాదాపు 2000 మీటర్ల ఎత్తులో ఉన్న కసౌలి అనేది చాలా అందమైన హిల్ స్టేషన్. ఇది ప్రేమికులకు ఫేవరెట్ ప్లేస్ గా పేరు తెచ్చుకుంది. ఈ ప్రదేశంలో ఎత్తైన పర్వతాలు, పచ్చని పైన్ చెట్ల అడవులు, ప్రశాంతమైన సరస్సులు, జలపాతాలు ఉండటం వల్ల ఇది చాలా అందంగా ఉంటుంది. ప్రకృతిని ఇష్టపడే వారికి కసౌలి ఒక బెస్ట్ ప్లేసు. ఇక్కడ కసౌలి బ్రూవరీ, క్రైస్ట్ చర్చి, సన్‌సెట్ పాయింట్, మంకీ పాయింట్ వంటి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.
సోలాన్
సోలాన్ ఓ అద్భుతమైన ప్రదేశం. ఇది హిమాచల్ ప్రదేశ్ రాజధాని శిమ్లా నుంచి దాదాపు 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 1000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి అందాలతో కట్టిపడేస్తుంది. ఎత్తైన పర్వతాలు, పచ్చని అడవులు, మెరిసే సరస్సులు, జలపాతాలు ఇక్కడి ప్రకృతి అందాన్ని మరింత పెంచుతాయి. బయట ఆడుకోవడం ఇష్టపడే వారికి సోలాన్ ఒక స్వర్గం లాంటిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: