కెనడా లో భారత విద్యార్థుల బహిష్కరణ? కారణం ఇదా.!

frame కెనడా లో భారత విద్యార్థుల బహిష్కరణ? కారణం ఇదా.!

మారిన రోజులకు అనుగుణంగా మారని కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ కోవలకే వస్తుంది కెనడా.  మొన్నటి వరకు ఒకలాంటి తీరును ప్రదర్శించిన ఆ దేశం ఇప్పుడు విదేశీ విద్యార్థులను తమ దేశానికి రాకుండే ఉంచేందుకు  వీలుగా తీసుకుంటున్న నిర్ణయాలు. చేపడుతున్న చర్యలు అంతకంతకూ ఎక్కువ అవతున్నాయి. దీంతో కెనడా లో ఉన్న వేలాది మంది విదేశీ విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.


తాజాగా విదేశీ విద్యార్థులు పలువురు ఆందోళన బాట పట్టడం గమనార్హం. విదేశీ విద్యార్థుల్ని తగ్గించుకునేందుకు వీలుగా చేస్తున్న చర్యలో భాగంగా జస్టిన్ ట్రూడో నేరుగా సీన్లోకి వచ్చేశారు. దీనికి కారణం విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను పరిమితం చేయడం. పర్మినెంట్ రెసిడెన్సీ నామినేషన్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని విదేశీ విద్యార్థులంతా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు.


ఈ సందర్భంగా ఎడ్వర్డ్ ఐలాండ్.. అంటారియో.. మనితోబా బ్రిటీష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇటీవల సమావేశం అయిన కేబినెట్ విదేశీ వర్కర్ల విధానంలో మూడు కీలక మార్పులు చేశారు. వాటిని సెప్టెంబరు 26 నుంచి అమల్లోకి తేనున్నారు. దీంతో విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉపాధి అవకాశాల్ని విదేశీ తాత్కాలిక కార్మికుల తక్కువ జీతాలకు పని చేయడానికి ముందుకు రావడంతో అక్కడి సంస్థలు వారికి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. ఈ కారణంగా కెనడియన్ల ప్రయోజనాలు దెబ్బ తింటున్నట్లు ట్రూడో సర్కారు భావిస్తోంది.


ఇందులో భాగంగా స్టడీ పర్మిట్లలో కోత విధించడం..  విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించడం.. శాశ్వత నివాస పర్మిట్లను తగ్గించడం వంటి చర్యల్ని చేపడుతుంది. అయితే  తాము తీసుకున్న నిర్ణయాలను ట్రూడో సర్కారు సమర్థించుకుంటోంది. దేశంలో పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసమే తాము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.


కాగా ట్రూడో సర్కారు తీరుపై విదేశీ విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా చేసిన మార్పుల కారణంగా 70 వేల మందికి పైగా అంతర్జాతీయ గ్రాడ్యూయేషన్ విద్యార్థులు కెనడాను విడిచిపెట్టే అవకాశం ఉంది. లక్షల ఖర్చు చేసి ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలనుకునే వారు మరో దేశాన్ని ఎంపిక చేసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: