ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే..!

lakhmi saranya
చాలామందికి ఉదయమునే లేవటం అంటే చాలా బద్ధకం వస్తుంది. మరి కొంతమంది మాత్రం త్వరగా లెగుస్తారు. ఉదయం నిద్ర లేవగానే మీ మూడ్ ఎలా ఉంటుందనే దానిని బట్టి కూడా ఆ రోజు మీరు చేయాల్సిన పనులు ప్రభావితం అవుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మానసిక స్థితి బాగుంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వర్క్ లోనూ ప్రోడక్టివిటి పెరుగుతుంది. అలాగే కొన్ని శారీరక లక్షణాలు కూడా పలు రకాలుగా ప్రభావితం చేస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే చివరకు అనారోగ్యాలకు దారి తీయవచ్చు. అలాగే కొన్ని రకాల లోపాలు, వ్యాధుల వల్ల కూడా అవి సంభావిస్తూ ఉండవచ్చు.
కాబట్టి కొన్ని రకాల మానసిక, శారీరక సంగీతనాలు లేదా లక్షణాలను నిర్లక్ష్యం చెయ్యవద్దని ఆరోగ్యాన్నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.! సాధారణంగా ఉదయం పూట నిద్రలేచినప్పుడు యాక్టివ్ గా ఉంటాం. మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా కొందరికి మగతగా అనిపించడం, ఏమీ తోచకపోవటం, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. తరచుగా ఇదే కొనసాగితే ప్రమాదకరమైన సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా అది నిద్రలేమి, డిప్రెషన్ కు కూడా దారితీస్తుంది.
అయితే శరీరంలో విటమిన్ డి 3 లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఇలా జరగవచ్చు. కాబట్టి మీలో ఉదయంపూట ఏమి తోచిని పరిస్థితి కనిపిస్తుంటే వైద్య నిపుణులను సంప్రదించటం బెటర్. మార్నింగ్ పూట లేవగానే కొందరికి తలనొప్పి వస్తూ ఉంటుంది. ప్రతిదానికి తీవ్రంగా స్పందిస్తుంటారు. ఇవన్నీ ఒత్తిడి కారణంగా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు సైనస్ ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు వల్ల కూడా ఇలా జరగవచ్చు. అలాగే ఒళ్ళు నొప్పులు వేధిస్తుంటే గనుక అవి పోషకాల లోపం వల్ల అయి ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఫైబ్రోమైర్జియా కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్నింగ్ పూట మీకు నోటిలో లాలాజలం ద్రవం మాదిరి ఎక్కువగా రావటం, ఆహారం తిన్నప్పుడు రుచిగా అనిపించకపోవడం వంటి సంకేతనాలు అనిపిస్తే అవి కూడా సైన్స్ ఇన్ఫెక్షన్లు లేదా ఐరన్, కాలుష్యం లోపం వల్ల కూడా జరగవచ్చు..కాబట్టి లక్షణాలు గురించి అలర్ట అవ్వాలంటున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: