క్యాన్సర్ పై అతిపెద్ద విజయం. వ్యాధిని గుర్తించే దివ్య యంత్రం

క్యాన్సర్ ఈ వ్యాధి పేరు వింటేనే నిద్రలోనైనా ఉలిక్కిపడతాం. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అనేది అందిరకీ తెలిసిందే. అయితే క్యాన్సర్ లోనూ కొన్నింటికి ట్రీట్ మెంట్ ఉండగా.. మరొకొన్నింటికి లేదు. ఒక్కసారి ఆ వ్యాధి బారిన పడితే శారీరకంగానూ.. మానసికంగానూ కుంగిపోవడం ఖాయం.


మెదడు  సహా శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేస్తుంటుంది ఈ వ్యాధి. ఇంతటి భయంకరమైన వ్యాధిని గుర్తించడంలో వైద్యులు మరో విజయం సాధించారు. వాస్తవానికి క్యాన్సర్ ను నిర్ధారించేందుకు వైద్యులు రకరకాల టెస్ట్ లు చేస్తుంటారు. వ్యాధి తొలిదశలో గుర్తిస్తే దీనికి చికిత్స ఉంటుంది. ముదిరితే వరకు చాలా కష్టం.


ఇంతటి భయంకరమైన వ్యాధిని గుర్తించడంలో వైద్యులు మరో విజయం సాధించారు. క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వెరీ డేంజరస్. ఈ వ్యాధి ఎవరికి అయినా రావొచ్చు. ఏజ్ లిమిట్ కూడా లేకుండా ఈ వ్యాధి సోకుతుంటుంది. 15 ఏళ్ల యువకుడి నుంచి వయస్సు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.


అత్యంత ప్రమాదకర ఈ వ్యాధిని గ్లియోబ్లాస్టోమా అని పిలుస్తారు. ఈ వ్యాధిని వేగంగా కనిపెట్టేందుకు వైద్యులు ఓ పరికరాన్ని కనిపెట్టారు. క్యాన్సర్ వ్యాధిని మనిషి నుంచి కణజాలాన్ని సేకరించి.. దానిని టెస్టు చేయడం ద్వారా గుర్తించిన నిర్ధారిస్తారు. ఇందుకు చిన్న సర్జరీ చేస్తారు. దీనికి కొంత సమయం కూడా పడుతుంది. అయితే ఈ ప్రాసెస్ లో కాకుండా కొత్తగా రక్త పరీక్ష విధానం ద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు ఈ పరికరాన్ని కనుగొన్నారు.


ఇందులో కీలకంగా ఉండే బయోచిప్, క్యాన్సర్ కారణమైన ఈజీఎఫ్ఆర్ వంటి కణాలను గుర్తిస్తుందని నాట్రదామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. అయితే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరీక్షకు ధర కూడా ఆ స్థాయిలో ఉంటుందోనని భయపడుతున్నారా? దానికి పెద్దగా టెన్షన్ అక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే రూ.168 కంటే తక్కువ ఉండబోతుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: