పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?.. అయితే తక్షణమే జాగ్రత్త పడండి..!
అవేమిటో చూద్దాం. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల అలసిపోవటం వేరు..కానీ కొందరు అలాంటివేవీ లేకపోయినా అధిక అలసటతో కనిపిస్తుంటారు. ముఖ్యంగా నడిచినా, మెట్లెక్కి నా, ఆటల్లో పాల్గొన్న పిల్లల్లో శ్వాసలో ఇబ్బందులు, అధిక అలసట వేధిస్తుంటే అది ప్రమాదకరం సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆస్తమా లేదా హృదయ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు లేదా డెవలప్ అయినప్పుడు కూడా ఈ లక్షణాలు వస్తుంటాయి. రక్తహీనత కారణం గా కూడా జరగవచ్చు.
అలాగే వర్షాకాలంలో అధిక అలసట ఆస్తమాతో పాటు న్యూమోనియా వంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీయవచ్చు. కాబట్టి దానిని గుర్తుంచిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం. పిల్లలు ఇంటిలో వండిన ఆహారాన్ని ఎప్పటి లాగా తినటానికి ఇష్టపడకపోవడం, టేస్టి కోసం బయటి ఆహారాలు, జంక్ ఫుడ్స్ కావాలని కోరటం కూడా తరచుగా చేస్తుంటే..వారిలో ఏదో ఒక సమస్యకు సంకేతం కావచ్చు. మానసిక రుగ్మతవల్ల కూడా ఇలా చేస్తుంటారు. అలాగే పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, కడుపులో ఉబ్బరం, గ్యాస్ట్రరైటిస్ వంటి సమస్యలున్నా పిల్లలు హామ్ ఫుడ్ ఇష్టపడరు. పిల్లలు చాలావరకు సన్నగా లేదా బొద్దుగా ఉంటారు. వారి శరీరాన్ని గమనించినప్పుడు దాదాపు ఒకే పరిమాణంలో ఉంటుంది. బొద్దుగా ఉన్నా కూడా పిల్లల బుగ్గలు, చేతులు, బ్యాక్ అన్నీ కాస్త లావుగా కనిపిస్తాయి. కానీ ఇలా కాకుండా కేవలం నడుము, పిరుదుల భాగం వద్ద మాత్రమే లావుగా ఉంది.