బ్రెడ్ ను ఫ్రిజ్లో పెట్టినా పాడవుతుందా?.. అయితే ఇలా చేయండి..!
అయితే చాలావరకు బ్రెడ్ ఫ్రిజ్ లో పెట్టినప్పటికీ కొన్ని రోజులకు ఫంగస్ వచ్చి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా జరగకూడదంటే నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. బ్రెడ్ తయారు చేసేటప్పుడు అందులోని స్టార్చ అణువులు వీటిని గ్రహించడం సాధారణంగా జరిగే ప్రాసెస్. దీంతో అది మృదువుగా, మొత్తగా అనిపిస్తుంది. అయితే దానిని చల్లటి ప్రదేశం లేదా ఫ్రిజ్ లో ఐదారు రోజులకు మించి ఉంచితే పాడవుతుంది.
ఎందుకంటే కూల్ వాతావరణంలో ఉంచినప్పుడు బ్రెడ్ లోని స్టోర్స్ అణువులు తిరిగి స్ఫుటికరించడం కారణంగా దాని నుంచి నీటిని లేదా తేమను బయటకు పంపుతాయి. దీంతో బ్రెడ్ గట్టిగా మారుతుంది. అలాగని బయట వాతావరణం లో ఉంచిన అదే జరుగుతుంది. పైగా ఇలాంటి అప్పుడు దానిపై ఫంగస్ చేరుతుంది. తినటం వల్ల వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు రావచ్చు. అయితే బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చెయ్యకుండా ఉంచితే ఇలా జరగదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఓపెన్ చేసి పెట్టిన ఫంగస్ రాకుండా ఉండాలంటే..దీనిని పరిశోభరమైన పొడివస్త్రంలో చుట్టి ఉంచాలని చెబుతున్నారు. దీంతో బ్రెడ్ పాడవకుండా ఉంటుంది. కాబట్టి బ్రెడ్ ను పాడవకుండా ఉండాలంటే ఏ విధంగా ట్రై చేయండి. తప్పకుండా పాడవకుండా ఉంటుంది.