ఈ ఉదయపు చెడు అలవాట్ల వల్ల బరువు పెరుగుతారా..?
ఉదయమనే నిద్ర లేవకపోతే చాలామందిలో నిద్రలేమి, బద్ధకం, ఏ పని చేయాలని అనిపించకపోవడం వంటివి జరుగుతాయి. ఉదయం లేటుగా నిద్ర లేస్తే వ్యాయామం చేసే సమయం ఉండదు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఉదయమునే టీ లేదా సోడా వంటి తీపి పానీయాలు తాగేవారు తొందరగా బరువు పెరుగుతారు. తీపి వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే చాలామంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్ తీసుకోని వారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఉదయాన్నే అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారం తీసుకున్న బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. ఫోన్ లేదా టీవీ వంటివి చూస్తూ తినే అలవాటు ఉన్నవారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటివి చెయ్యకుండా ఉంటే బరువు అనేది పెరగకుండా ఉంటారు. ఉదయం లేవగానే తీపి పదార్థాలు ఎక్కువగా తింటే వారు బరువు అనేది ఎక్కువగా పెరుగుతారు. కాబట్టి ఉదయమునే తీపి పదార్థాలు తినకుండా ఉండటం చాలా మంచిది. ఉదయమునే కూల్ డ్రింక్స్ లాంటివి తాగిన కానీ బరువు పెరుగుతారు. కాబట్టి ఉదయమునే లెగిచి అల్పాహారాన్ని తినండి. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు.