మధుమేహాన్ని గుర్తించే సింపుల్ టిప్స్ ఇవే..!
ముందస్తు సంకీర్తనలు లేదా లక్షణాలపై అవగాహన లేకపోవడం ఎందుకు కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ప్రారంభానికి ముందు కళ్ళల్లో కనిపించే లక్షణాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్నట్టుండి కంటి చూపులో మార్పులు సంభవిస్తాయి. అస్పష్టమైన దృష్టిని అనుభవిస్తారు. ఈ సంకేతనాలు మీలో కనిపిస్తే కనుక డయాబెటిస్ ప్రారంభ దశలో ఉందని అర్థం. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గలవల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ విధమైన మార్పు ఐ లెన్స్ వాపునకు దారి తీయటం వల్ల కళ్ళల్లో అస్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది. దానిని బట్టి మీ రక్తంలో చక్కెరస్థాయిలో సాధారణంకంటే ఎక్కువగా పెరిగిపోయాయని తెలుసుకోవచ్చు. వెంటనే డాక్టర్లను సాంప్రదించటం ఉత్తమం. మధుమేహం ప్రారంభంలోనే నరాలపై ప్రభావం చూపుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే కళ్ళల్లో నొప్పి లేదా ఒక విధమైన ఒత్తిడిని అనుభవిస్తున్న్ భావన ఏర్పడుతుంది. మీలో ఆ సంకేతనాలు కనిపిస్తే మధుమేహం బారిన పడి ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా గ్లాకోమా వంటి పరిస్థితికి దారితీయవచ్చు. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించి తగిన సూచనలు పాటించడం బెటర్. కళ్ళలో ఒత్తిడి వంటి భావనలతో పాటు కళ్ళు చుట్టూ బాపు కనిపించడం కూడా మధుమేహం ప్రారంభ లక్షణంగా పేర్కొంటున్నారు నిపుణులు.