గుండె సమస్యలు ఉన్నవారు.. రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ తాగాలో తెలుసా..?
అలా జరగకూడదంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ నీరు తాగాలని చెప్తుంటారు. ముఖ్యంగా ఒక వ్యక్తి రోజుకు 3 నుంచి 4 లీటర్లు లేదా 7 నుంచి 8 క్లాసుల వరకు తాగటం మంచిది. కానీ ఇది గుండె జబ్బులు ఉన్నవారికి వర్తించదనే విషయం మీకు తెలుసా? మరి మీరు ఎంత నీరు తాగాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా శరీరాన్ని హైడ్రేట్డ ఉంచడంలో నీరు ఎక్కువగా తాగటం కీలక పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులో ఉన్న వారిలో మాత్రం ఎందుకు భిన్నంగా జరుగుతుందని ఆరోగ్యాన్నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీరి శరీరంలో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి వినరల్స్ సమతుల్యంగా ఉండాలి.
నీరు అధికంగా తాగితే ఈ సమతుల్యం దెబ్బతింటుందని అంటున్నారు. పైగా గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ పరిస్థితి 'గుండె పంపింగ్ సమర్థ్యం' దెబ్బ తీసేందుకు కారణం కావచ్చు. అలాగే గుండెపై ఒత్తిడి పెరగడం, ధమనులు బలహీనంగా మారటం, హార్ట్ రేట్ తగ్గటం వంటివి సంభవించే అవకాశాలు ఉంటాయి. మూత్రపిండాలపై కూడా ఒత్తిడి పెరుగుతుందని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు రోజుకు 2 లీటర్లకు మించి నీరు తాగకపోవటమే సురక్షితమని అంటున్నారు. కాబట్టి ఈ వ్యాధి ఉన్నవారు నీరుని తక్కువగా తాగండి. రోజుకి 2 లీటర్లు నీరు మాత్రమే తాగండి.