ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే ఎట్టి పరిస్థితుల్లో అల్లం తినవద్దు..!
మరి ఏ వ్యాధి గ్రస్తులు అల్లం తీసుకోకూడదు ఇప్పుడు మనం చూద్దాం. గర్భధారణ సమయంలో అల్లం ఎక్కువగా తీసుకోవటం వల్ల కండరాల నొప్పులు ఏర్పడి, నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీస్తుంది. చాలామంది వైద్యులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చివరి మూడు నెలలు అల్లం తినకూడదని సలహా ఇస్తారు. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో మార్నింగ్ సిక్ నెస్ నుంచి బయటపడేందుకు మాత్రం కొద్దిగా అల్లం తినవచ్చు. హిమోఫిలియా అనేది జన్యుపరమైన రుగ్మత. క్లాటింగ్ ప్రోటీన్ లేనప్పుడు రక్తం గడ్డకట్టదు.
చిన్న కొత జరిగిన విపరీతమైన రక్తస్రావం జరిగి ఒక్కొక్కసారి మరణానికి కూడా కారణవుతుంది. కనుక హేమోఫిలియా మందులను తీసుకునే వారు అల్లం తీసుకోవటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. అదికా బరువు ఎంత పెద్ద సమస్యో తక్కువ బరువు ఉండటం కూడా అంతే పెద్ద సమస్య. బరువు పెరగాలని ప్రయత్నిస్తే అల్లం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. అల్లం లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులోని PH స్థాయిని పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను పేరేపిస్తుంది. ప్రతిరోజు అల్లం తినటం వల్ల జుట్టు రాలటంతో పాటు, బహిష్టు సక్రమంగా రాకుండా పోతుంది హైపర్ టెన్షన్ లేదా డయాబెటిస్ మెడిసన్ తీసుకునే వారు కూడా అల్లం ఎక్కువగా తినటం మంచిది కాదు. అల్లం రక్త పలుచబడేటట్లు చేసి తద్వారా రక్తపోటును తగ్గిస్తుంది.