టీనేజ్ లో కోపం ఎక్కువా..?తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే..!
అయితే పిల్లల కోపాన్ని కంట్రోల్ చెయ్యటానికి నిపుణుల ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. టీనేజ్ ర్స్ లో కోపం, అతి బాగోద్వేగాలకు కారణం వారిలో కలిగే మానసిక సంఘర్షణ కూడా కారణం. అలాగే పిల్లలు చాలా విషయాలు తమ తల్లిదండ్రులు, కుటుంబంలోని ఇతర సభ్యులను చూసి నేర్చుకుంటారు. కాబట్టి పేరెంట్స్ తరచుగా ఒకరిపై ఒకరు కోపంగా అరుచుకోవటం, పిల్లలపై కూడా కోపాన్ని ప్రదర్శించడం వంటివి వారు యుక్త వయసులో ఉన్నప్పుడు ఆస్లు చెయకూడదు. ఎందుకంటే వారు కూడా ఆమె అలవాట్టను, వ్రవర్తనను అలవర్చుకునే అవకాశం ఎక్కువ. యుక్త వయస్సు కాబట్టి కాస్త కోపాన్ని ఎక్కువే ప్రదర్శిస్తుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ పిల్లలతో వ్యవహరించే తీరు మార్చుకోవాలి.
వారితో కోపంగా కాకుండా ప్రేమగా, స్నేహ పూర్వకంగా వంసులుకోవాలి. ఏ విషయంలో ఎలా ఉండాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో వివరించాలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా మానసిక, శారీరక ఆరోగ్యాలపై అవగాహన కల్పించాలి. అసలే యుక్త వయస్సు. బయటి సమాజంలో చూసిన విషయాలు, స్నేహితుల ద్వారా నేర్చుకున్న అంశాలు, సినిమాలు, టీవీల్లో చూసే ప్రోగ్రాములు ప్రభావం వంటివి పిల్లలపై పడుతుంటాయి. అయితే కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను సందేహాలు అడగడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ "నోర్ముయ్, అలాంటివి నీకెందుకు? ఇతరుల విషయాలు ఎందుకు? ముందు బాగా చదువుకో, చెప్పిన పని చేయ్ ముందు" వంటి మాటలతో పిల్లలపై కోప్పడుతుంటారు.