మీరూ పప్పును కుక్కర్లో వండుతున్నారా? అయితే ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
పప్పు చేసిన వంటకాలు వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా పప్పులో లభించే పోషకాలు మరే ఇతర ఆహారంతో సరిపోలవు. అయితే ఒక్కొసారి వంట చేసేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల పప్పు తిన్న తరువాత కూడా అందులోని పోషకాలు శరీరానికి అందవు. అందుకే పప్పు వన్డే విధానం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం కాలంలో చాలా మంది ప్రెషర్ కుక్కర్ లో పప్పులు ఉడకబెట్టి వంట చేస్తుంటారు. నీటిలో నానబెట్టడం నుంచి ఉడకబెట్టడం వరకు-పప్పు వండటనికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బేసిక్ పప్పును తప్పనిసరిగా ఉడకబెట్టాలి. కానీ ఎక్కువ సేపు ఉడకనీయవద్దు. ప్రెషర్ కుక్కర్లో లేదా సాస్ ప్యాక్ లో తప్పులను ఎక్కువసేపు నీటిలో ఉడకబెట్టడం వల్ల దానిలోని ప్రోటీన్ ను నాశనం అవుతుంది. పప్పులను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే అమినో యాసిడ్ లు నశిస్తాయి. ప్రెజర్ కుక్కర్ లో ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఫ్రైటెక్ యాసిడ్ గాఢత తగ్గుతుంది. అలాగే, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ సమతుల్యత కోల్పోతుంది. కాబట్టి పప్పును ఎక్కువసేపు ఉడక పెట్టకపోవడం మంచిది.పప్పును నీళ్లలో నానబెట్టకుండా ఉడికించకూడదు. నీటిలో నానబెట్టకపోతే, పప్పుకు ఈ ఎటువంటి పోషకాలు అందవు. పైగా నానబెట్టకుండా చేసిన పప్పు ఆహారంలో తీసుకుంటే జీర్ణ రుగ్మతలు సంభవించవచ్చు. నీటిలో నానబెట్టిన తరువాత పప్పు పంటకు వినియోగిస్తే సులభంగా జీర్ణం అవుతుంది.