కళ్ళచుట్టూ డార్క్ సర్కిల్స్...పుదీనా ఆకుతో ఇలా చేస్తే చాలు మీ మచ్చలు మాయం...?

frame కళ్ళచుట్టూ డార్క్ సర్కిల్స్...పుదీనా ఆకుతో ఇలా చేస్తే చాలు మీ మచ్చలు మాయం...?

lakhmi saranya
చాలామందికి కళ్ళ కింద నల్ల మచ్చలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి కొంతమందికి మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా నల్ల మచ్చలు మొటిమలు రాకుండా ఉండాలంటే పుదీనా ఆకును రాసుకుంటే మచ్చలు అనేవే ఉండవు. పుదీనా..గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది వంటకాల్లో మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కళ్ళ చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకోసం కొన్ని పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్ట్ లా తయారు.
 దానిని ప్రతి రోజు డార్క్ సర్కిల్స్ ఉన్న భాగంలో అప్లై చేసి,చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు మాయం అవుతాయి. ఉరుకులు....పరుగుల జీవితం,మానసిక ఒత్తిడి, నిద్రలేమి...ఇలా కారణాలేమైనా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు లేదా మచ్చలు వంటివి ఏర్పడే సమస్యలను పలువురు ఎదుర్కొంటున్నారు. అయితే వీటిని వివారించటంలో పుదీనా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అందుకోసం ముందుగా పుదీనా ఆకులను మొత్తగా గ్రైండ్ చేయాలి.
 దానిని పేస్ట్ లాగా మార్చి, ఆ తరువాత కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతంలో క్రీమ్ లాగా అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా కొంతకాలం చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. అలాగే పుదీనా ఆకుల నుంచి తీసిన రసాన్ని ఐస్ ట్రేలలో పోసి ఫ్రిజ్ చేయాలి. తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ తో కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ పై రాయాలి. కొంతకాలానికి అవి తగ్గిపోతాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంపై కూడా పుదీనా ఆకుల రసాన్ని అప్లై చేస్తే స్కిన్ అలెర్జీలు రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నవారు ఈ ఆకుని తప్పకుండా అప్లై చేయండి. మీ మచ్చలు త్వరగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: