మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా...? లంచ్ టైంలో ఈ మిస్టేక్స్ అసలు చేయకండి....?
వాటిని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లంచ్ టైంలో చేయకూడని మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొందరు భోజనం తర్వాత స్వీట్లు తినటానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే మధుమేహం ఉన్నప్పుడు ఇలా చేయటం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి తినకపోవడం మంచిది. షుగర్ పేషెంట్లు మధ్యాహ్న భోజనం తర్వాత వేయించిన ఆహార పదార్థాలు తినటం కూడా మంచిది కాదు. వీటిలో ఉప్పు, నూనె అధికంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి హానికరం.
అందుకు బదులు ఫైబర్ కంటెంట్ ఉన్న ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ తినటం మంచిది. లంచ్ తర్వాత డయాబెటిక్ షేషెంట్లు కూల్ డ్రింక్స్ తాగటం కూడా మంచిది కాదు. వీటిలో కృత్రిమ స్వీటెనర్లు అధికంగా ఉంటాయి. కాబట్టి చక్కెర స్థాయిలు పెరగటానికి కారణం అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు పండ్లని కూడా ఎక్కువగా తినకూడదు. నైట్ టైం ఆహారం తీసుకోకుండా అల్పాహారాన్ని తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ని అస్సలు వాడకూడదు. ఈ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్వీట్స్ అనేవి ఎక్కువగా తినటం వల్ల డయాబెటిస్ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది.