తేనె మాత్రమే కాదు..తేనె తుట్టితోనూ బోలెడు ప్రయోజనాలు.!
ఇందులో మైనం ఉంటుంది. దీనినే బిస్ వ్యాక్స్ అంటారు. అయితే దీనిని కొద్దిగా ప్రాసెన్ చేసి వాడుకునే విధంగా తయారు చేస్తారట. కొవ్యాత్తలు, బ్యూటీ ప్రొడక్ట్స్, మాయిశ్చరైజర్లు, కాస్మోటిక్స్, సబ్బులు వంటి వాటి తయారీలోనూ ఉపయోగిస్తారు. అంతేకాకుండా గీతలు పడి, పాతగా అనిపించే ఫర్నిచర్ ను కొత్తగా మార్చటంలో ఈ తేనెతుట్టెలోని మైనం ద్వారా తయారు చేసిన బీస్ వ్యాక్స్ ఉపయోగిస్తారు. లెదర్ తో యారు చేసిన వస్తువులను భద్రపర్చేందుకు తయారు చేసే వాటర్ ప్రూఫ్ కోటింగ్ బ్యాసల తయారీలో కూడా తేనెతుట్టెలోని మైనం ఉపయోగిస్తారట.
అందుకే తేనే తుట్టె ధర వాస్తవానికి తేనె కన్నా అధికంగా ఉంటుందంటున్నారు నిపుణులు. తేనె మాత్రమే కాదు, తేనె తుట్టెను కూడా తింటారు కొందరు. రుచిగా కూడా ఉంటుంది. అలాగే టోస్టులు, బ్రెడ్, కేక్, ఐస్ క్రీమ్, గులాబ్ జామూన్ల వంటి స్వీట్ల మాదిరే తేనెతుట్టెను తినటానికి ఉపయోగిస్తారు.సలాడ్లు, స్మూతీలతో దాన్ని ముక్కలను కలుపుకొని తాగుతారు. అలాగే విదేశాల్లో చీజ్, బీస్ వ్యాక్స్ కలిపి తినేవారు ఎక్కువగా ఉంటారు. తేనె తుట్టెను చూయింగ్ గమ్ మాదిరి నమిలి తినటానికి కూడా ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు చూయింగ్ గమ్ తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. తేనెతుట్టెను నమిలే కొద్ది అందులో నుంచి తేనే వస్తు నోటికి రుచిగా అనిపిస్తుంది. కాగా తేనె మాత్రమే మింగి, తర్వాత నోట్లో మిగిలిపోయిన మైనంను చూయింగ్ కం లాగానే ఉమ్మివేయవచ్చు.