స్వీట్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇవి పట్టించుకోకపోతే తప్పదు ముప్పు..!
అయితే ఎప్పుడు పడితే అప్పుడు తీపి పదార్థాలు తినటం మంచిది కాదు. స్వీట్లు తినటానికి కూడా సరైన టైమ్ ఉంటుందంటున్నారు నిపుణులు. అప్పుడెప్పుడు స్వీట్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో నిపుణులు చెప్పినవి ఇప్పుడు చూద్దాం... స్వీట్ లవర్స్ ఈ విషయాలు తప్పక గుర్తు ఉంచుకోండి. వ్యాయామానికి ముప్పై నిమిషాల ముందు తీపి పదార్థాలు తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాయామానికి ముందు తిన్నట్లైతే... స్వీట్స్ నుంచి పొందిన కేలరీలు బర్న్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం పూట కూడా తీపి పదార్థాలు తినవచ్చు.
కాగా స్వీట్స్ తినాలనుకునే వారికి ఇది మంచి సమయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే నైట్ తిన్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీట్స్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు అయితే అసలు తినొద్దని అంటున్నారు. కాబట్టి స్వీట్లు ఈ టైంలో అసలు తినకండి. స్వీట్స్ మరింత ఎక్కువగా తినటం వల్ల బరువు మరింత త్వరగా పెరుగుతారు. కాబట్టి స్వీట్లను మరీ ఎక్కువ కూడా తినకండి. స్వీట్స్ తినటం వల్ల డయాబెటిస్ సమస్య కూడా వస్తుంది. ఆ సమస్య ఉన్నవారు కూడా స్వీట్లు అసలు తినకూడదు. చాలామంది రోజు అస్తమాను స్వీట్స్ తింటూ ఉంటారు. అలా తినటం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి రోజుకు ఒక్కసారి తినవచ్చు మరీ ఎక్కువ తినటం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది.