యాపిల్స్ లో రకాలెన్నో తెలుసా.... ఏ రకం మంచిదంటే..?
చాలామంది యాపిల్స్ ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇప్పుడు యాపిల్స్ కి మందులు అనేవి ఎక్కువగా కొడుతున్నారు. నాచురల్ గా పండే ఆపిల్స్ తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇప్పుడు వచ్చే యాపిల్స్ అన్ని కూడా మందులు కొట్టి పండించినవే. ఎవరైనా అనారోగ్యం పాలైతే చాలు చూడటానికి వచ్చిన వాళ్ళు యాపిల్ పల్లని తీసుకునస్తుంటారు. అయితే ఈ యాపిల్ పంట ఎక్కువగా హిమాచల్ ప్రదేశంలోని సిమ్లా జిల్లాలో పండుతాయి. ఈ ఆ యాపిల్లలో చాలా రకాలు ఉన్నాయి. మరి అందులో ఏది బెస్ట్ , ఎలాంటి వాతావరణంలో యాపిల్స్ ఉత్పత్తి అవుతాయి ఇతర విషయాలను ఇప్పుడు చూద్దాం.
యాపిల్ లో చాలా రకాలు ఉన్నాయని యాపిల్ రైతులు చెబుతున్నారు. కొత్త రకాలు మార్కెట్లలో నిరంతరం కనిపిస్తుంటాయని చెబుతున్నారు. వీటిలో గాలా, రెడ్ వైన్ , గ్రానీ స్మిత్ మొదలైన రకాలు ఉంటాయని చెబుతున్నారు. ఇది తక్కువ రైతుల్లో (4 నుంచి ఐదున్నర వేల అడుగులు) పెరుగుతుంది. అలాగే మరికొన్ని రకాలు స్పర్, రెడ్ గోల్డెన్, రెడ్ రాయల్ మధ్య రైతుల్లో (5న్నర నుంచి 8 వేల అడుగుల వరకు) పెరుగుతాయి.
కాగా, రాయల్ యాపిల్, దీన్ని రెడ్ డెలిషియస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇది రైతుల్లో (8 వేల అడుగుల పైన) పెరుగుతుంది. ఇందులో రాయల్ యాపిల్ ను బెస్ట్ యాపిల్ అంటారు. దీనికి చాలా రకాలు ఉన్నాయి. రాయల్ యపిల్ చాలా తక్కువ జీవితకాలం కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు నిపుణులు. రాయల్ యపిల్ ను 6 నెలల పాటు కోల్డ్ స్టోర్ లో నిల్వ చెయ్యవచ్చు. ఆ తర్వాత కూడా యాపిల్ తాజాగా ఉంటుంది. అయితే స్పర్ లేదా ఇతర రకాలు ఒక వారంలోనే పాడైపోతాయి. యాపిల్ ని తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. యాపిల్ లో ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. కాబట్టి దీనిని తప్పకుండా తినండి.