ఎక్కిళ్ళు ఎంతకీ తగ్గట్లేదా..? ఇలా చేస్తే క్షణంలో ఎక్కిళ్ళు తగ్గిపోతాయి...!
తగినంతగా నీళ్లు తాగకపోవటం,ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల కూడా వస్తుంటాయని, మరికొన్నిసార్లు ఎందుకు వస్తాయో కూడా చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అయితే వచ్చినప్పుడు వెంటనే ఆపడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటే నీళ్లు తాగితే కొన్నిసార్లు తగ్గిపోతాయి. ఎక్కువగా వస్తే తగ్గకపోవచ్చు కూడా. ఆ సమయంలో దీర్ఘంగా శ్వాస పీల్చుకుని కొన్ని క్షణాలు ఊపిరి బిగబట్టాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదలాలి.
ఈ టెక్నిక్ ద్వారా ఎక్కిళ్ళు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెండు చెవులను అరచేతులతో గట్టిగా కప్పేసినట్టు నొక్కుతూ శ్వాసను దిగబట్టుకోవడానికి ప్రయత్నించినా ఎక్కిళ్ళు ఆగిపోయే అవకాశం ఉంది. ఎక్కిళ్ళు ప్రారంభం అయినప్పుడు ఏదైనా తింటే గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఓ స్పూన్ వెన్నలో చిటికెడు చక్కెర కలుపుకుని తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. అందుబాటులో ఉండే ఓ చిన్న నిమ్మకాయ ముక్కను నోటిలో వేసుకున్న ఎక్కిళ్ళు తగ్గుతాయట. ఇందులోని పుల్లని రుచి మౌత్ డయాఫ్రమ్ కండరాలను పేరేపించడం ద్వారా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. కాబట్టి ఎక్కిళ్ళు వచ్చిన వారు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఎక్కిళ్ళు తప్పకుండా తగ్గుతాయి. అలా అని మరీ ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తే మాత్రం అసలు తగ్గదు. మీరు డాక్టర్ని సంప్రదించాల్సిందే.