ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎన్ని లాభాలా?.. అయితే కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే..!
మీరు ముందుగానే లేస్తే పోషకాలు నిండుగా ఉండే అల్పాహారంతో మీ రోజు ప్రారంభించవచ్చు. లేటుగా లేచి బ్రెడ్, వెన్నెతో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చే సే బదులు ... ముందుగా లేచి న్యూట్రిషన్లు కలిగిన టిఫిన్ చేయడం ముంచిది. దీనివల్ల రోజంతా సంతృప్తిగా ఉత్సాహంగా ఉంటారు. త్వరగా లేవటం వల్ల ప్రశాంతంగా పని పూర్తి చేసుకునేందుకు సమయం లభిస్తుంది. రెగ్యులర్ గా మార్నింగ్ ఎక్సర్ సైజ్ చేసుకునే టైం దొరుకుతుంది. దీనివల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది.
ఆరోజు మరింత చిరుకుగా ఉండేలా ప్రోత్సాహిస్తోంది. ఉదయమునే లేచేవారు ఉదయపు సూర్య కిరణాల లాభాన్ని పొందవచ్చు. దీని విటమిన్ డి సహజ మూలం. కాగా ఎముకల ఆరోగ్యం, మెంటల్ హెల్త్, రోగనిరోధక శక్తి పెరుగుదలకు శరీరానికి చాలా అవసరం. త్వరగా లేచినప్పుడు... రోజు ఎలా గడవాలో , ఏ పనికి ఏ టైమ్ కేటాయించాలి అనేది ప్లాన్ చేసుకునేందుకు అదనపు సమయం ఉంటుంది. ఈ ప్రణాళిక దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. టాస్క లకు టైం ఇస్తూ అన్ని పూర్తయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. మొత్తానికి ప్రోడక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. ఎర్లీ రైజర్స్ తరుచుగా మెరుగైన మానసిక ఆరోగ్యం, ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. రోజును ప్రశాంతంగా ప్రారంభించడం, తొందరపడే ఛాన్స్ లేదు కాబట్టి ఒత్తిడి ఉండదు. కాబట్టి రోజంతా సానుకూలంగా ఉండే దినచర్య ఏర్పాటు చేసుకోవడం సులభతరం చేస్తోంది.