ఉప్పు ఎక్కువగా తింటున్నారా?.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
అందుకే ఉప్పును నిర్ణీత పరిమితీలో తినమని సలహా ఇస్తారు. ఎక్కువ ఉప్పు గుండెతో పాటు మూత్రపిండాలా పై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక ఉప్పు గుండెను మాత్రమే కాకుండా మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, అదనపు ఉప్పు మూత్రంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. రాళ్లే కాకుండా, అదనపు ఉప్పు మూత్రంలో ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతుంది. దీనివల్ల కిడ్నీ సమర్థ్యం దెబ్బతింటుంది. ఇది కిడ్నీ దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది.
అందువల్ల ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉప్పు, కిడ్నీ ఆరోగ్యాన్ని పాడు చేసినట్లే, తక్కువ నీరు తాగటం వల్ల కూడా కిడ్నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని కిడ్నీ నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలో పేరుకుపోయిన టాక్సిన్స్ మొత్తం తొలగిపోతాయి. అలాగే ఎక్కువ నీరు తాగటం వల్ల యూరిక్ యాసిడ్ అధికంగా ఏర్పడకుండా చేస్తుంది. రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత ఎక్కువ నీరు తాగటం మంచిది. ఇవన్నీ కాకుండా కిడ్నీలకు ఏదైనా గరిష్ఠంగా కానీ కలిగిస్తున్నాయంటే అవి పెయిన్ కిల్లర్స్. ఈరోజుల్లో ప్రజలు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి నొప్పికైనా కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు.