ఈ పండుతో మూత్రపిండాల్లో రాళ్లకు చెక్ పెట్టండి..!
ఇది UTI సమక్రమణ ప్రమాదం కలిగిస్తుంది. దానిమ్మ పండు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా పండ్లు బయటికి నుంచి ఎర్రగా కనిపిస్తాయి. కానీ లోపల గింజల రంగు లేత ఎరుపు రంగులో ఉంటాయి. వాస్తవానికి దానిమ్మపండు శక్తి దాని ఎరుపు రంగులోనే దాగి ఉంటుంది. ఆంథోసైనిన్ కారణంగా పండులోని గింజలకు ఎరుపు రంగు వస్తుంది. మరి కిడ్నీలో రాళ్లు సమస్య నుంచి బయటపడేందుకు తాజా దానిమ్మపండును ఎలా తినాలో, ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంథోసైనిన్ కారణంగా దానిమ్మ ఎరుపు రంగులో ఉంటుంది.
ఈ సమ్మేళనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. టైప్ 2 డయాబెటిస్, నాడి సంబంధిత వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అవి ప్రయోజనకరమైన రోగనిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. దానిమ్మ గింజల్లో ఉండే రసం మూత్రపిండాల్లో రాళ్లను నివారించటంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలలో తెలిపింది. దానిమ్మను తీసుకోవటం వల్ల రాళ్లకు ప్రధాన కారణాలైన ఆక్సలేట్, క్యాల్షియం, ఫా స్ఫేట్ రక్తంలో చేరకుండా నిరోధిస్తుందని ఒక అధ్యాయనం చెబుతోంది. సర్జరీ లేకుండానే కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే దానిమ్మ రసం తాగటం ఉత్తమంటున్నారు నిపుణులు. విత్తనాలు లేకుండా దానిమ్మ రసం తయారు చేసుకుని తిగారంటే మంచి ఉపశ్రమణం లభిస్తుంది.