గొంతు నొప్పితో బాధిస్తున్నారా?.. అయితే ఈ ఆయుర్వేద చిట్కాని పాటించండి..!

lakhmi saranya
వర్షంలో ఎక్కువగా తడవటం వల్ల జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. జలుబు చేసిన తక్షణం గొంతు నొప్పి కూడా వస్తుంది. జలుబు, దగ్గు అనేవి కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా వర్షంలో ఎక్కువగా తడవకండి. చాలామందికి జలుబు చేసిన వెంటనే గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. గొంతు నొప్పి అత్యంత సాధారణ వ్యాధుల్లో ఒకటి. ఇది వైరస్ వల్ల వస్తుంది. చాలామందిలో ఈ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు, పెద్దలు గొంతు నొప్పి నుంచి ఉపశ్రమమం పొందడానికి వందలో 99 శాతం మంది మెడికల్ షాపుల బాట పడతారు.
 అయితే ప్రతిసారి టాబ్లెట్స్ వేసుకోవటం మంచిది కాదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా... గొంతు నొప్పి నుంచి ఉపశ్రమమం పొందటమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు. జలుబు, కఫం, గొంతునొప్పి, జీర్ణ క్రియ వంటి సమస్యలను తరిమికొట్టడానికి మీ వంటింట్లో ఉండే వస్తువులను ట్రై చేస్తే చాలు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. త్రికటు చూర్ణం గొంతు నొప్పి తగ్గించడంలో సూపర్ మెడిసిన్ లా పని చేస్తుంది. నల్ల మిరియాలు, శాంఠి అల్లం, పిప్పాలి కలిపి ఈ చూర్ణాన్ని తయారు చేసుకోండి. ఇది తీసుకుంటే గొంతు నొప్పి పోవటమే కాకుండా ఆకలిని మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియకు మేలు చేస్తుంది.
 దగ్గు, జలుబు, అలర్జిక్ రైనైటిస్ ఆస్తమా వంటి ప్రాబ్లమ్స్ మాయమవుతాయి. త్రికటు చూర్ణంలో డిటాక్సిఫికేషన్ లక్షణాలను కలిగి ఉంటుంది. పిప్పాలి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. దీన్ని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా థైరాయిడ్ సమస్యకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాకా ఈ పొడిని నైట్ తిన్నాక 3 గ్రాములు వాటర్లో కలిపి తీసుకోవాలి. కారంగా ఉంటుంది కాబట్టి... ఆహారంలో కూడా కలిపి తీసుకోవచ్చు. కాబట్టి గొంతు నొప్పి ఉన్నవారు ఈ పౌడర్ ని తప్పకుండా ట్రై చేయండి. తక్షణమే ఉపశ్రమమం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: