వాటర్ లో మాత్రమే పెరిగే ఇండోర్ ప్లాంట్స్ ఇవే..!
అయితే కొన్ని మొక్కలు మాత్రం ఎలాంటి మట్టి, ఎరువులు అవసరం లేకుండా కూడా ఇంటి అందాన్ని పెంచుతాయి. అలాంటి మొక్కలను ఇంట్లో ఎక్కడైనా, సౌకర్యవంతంగా పెంచుకోవచ్చు. అంతేకాదు వాటికి రోజు వారీగా నీళ్లు పొయ్యాల్సిన పని కూడా ఉండదు. వారానికి ఒక్కసారి లేదా 15 రోజులకు ఒక్కసారి మాత్రమే నీటిని మార్చవలసి ఉంటుంది. దీంతో ఆ మొక్కలు అందంగా, పచ్చగా ఉంటాయి. మరి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్కీ వెదురు... ఈ పేరులోనే లక్కీ ఉంది. పేరు సూచించినట్లుగానే ఇంట్లో ఉండటం మంచిది. చాలామంది ఇష్టపడే ఇండోర్ ప్లాంట్లలో ఇది ఒకటి. ఈ మొక్క ఇంటికి అలంకారమే కాకుండా సానుకూల శక్తిని అందిస్తుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ మొక్కను మట్టి లేకుండా నీటిలో సులభంగా పెంచవచ్చు. దీనికోసం మీరు ఒక కంటైనర్ లో నీటిని నింపాలి. అందులో లక్కీ వెదురు కొమ్మను ఉంచాలి. మొక్క సంరక్షణ కోసం ప్రతి రెండు వారాలకు నీటిని మార్చాలని చెబుతున్నారు. మూలాలు నీటిలో మునిగిపోయేలా చూసుకోండి. మనీ ప్లాంట్ కూడా చాలామంది ఎక్కువగా ఇష్టపడే ఇండోర్ ప్లాంట్. ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే అధిక ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ మొక్కను నాటడం చాలా సులభం, మీరు కొమ్మను కత్తిరించి ఏదైనా వాటర్ బాటిల్ లేదా కుండలో దీన్ని నాటాలి. దాని సంరక్షణ కోసం నీరు వారానికి ఒక్కసారి నీటిని మార్చవచ్చు.