ఈ పిజ్జా చూస్తే చాలు నోరు ఊరి... గుటుక్కున మింగిపడేస్తారు..?
ఎందుకంటే ఇవి జంక్ ఫుడ్ కిందకే వస్తాయి. కాగా హ్యాపీగా ఇంట్లోనే పిజ్జా దోసెను వేసి మీ పిల్లలకు పెట్టండి. ఇంట్లో చేసిన ఈ ఆరోగ్యకరమైన పిజ్జా తింటే పిల్లల హెల్త్ ను కాపాడిన వారవుతారు. దోసల పిండి - వన్ కప్ , టమాటా తరుగు, క్యాప్సికం, మిరియాల పొడి - పప్పు స్ఫూను, చీల్లి ప్రేగ్స్, బటర్, తురిమిన చీజ్, ఒరేగానో - అర స్పూను, పిజ్జా సాస్, ఉప్పు, ఉల్లిపాయల ముక్కలు, ఒరెగానో, స్వీట్ కార్న్ గింజలు తీసుకోవాలి.
గ్యాస్ పై కడాయి పెట్టుకుని దోసె పిండిని ఊతప్పం లా మందంలా వేసుకుని మూత పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక... దానిపై బటర్, పిజ్జా సాస్ వేయాలి. వీటిపై తరిగిన క్యాప్సికం, టమాటా, ఉల్లిపాయని వేసుకోవాలి. తరువాత స్వీట్ కార్న్ గింజలు, మిరియాల పొడిని, చిల్లి ఫ్లాగ్స్, ఒరెగానో చల్లాలి. 2 మినిట్స్ అయ్యాక చీస్ నువ్వు వేసి మళ్లీ బటర్ వెయ్యాలి. 5 నిమిషాలు తరువాత పిజ్జా దోస రెడీ అయిపోయినట్లే... ఇక మీ పిల్లలకు పిజ్జా కట్టర్ తో కట్ చేసి ఇస్తే చాలు ఇష్టంగా తింటారు. బయటవి పెట్టకుండా ఈ విధంగా పిజ్జా దోసను తయారు చేయండి. తయారుచేసి మీ పిల్లలకు పెట్టండి.