చెడు కొలెస్ట్రాల్ ను తరిమికొట్టాలనుకుంటున్నారా?.. అయితే వీటిని తీసుకోండి..!
ఒమేగా -3 ఫ్యాటి యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల బిపి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వంటల్లో వెల్లుల్లిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వెల్లుల్లి వల్ల రోగ నిరోధక శక్తి పెరగటంతో పాటుగా అనేక లాభాలని పొందవచ్చు. రోజు రెండు, మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. రాత్రంతా మెంతుల్ని నానబెట్టి ఉదయమునే తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.
గుండె ఆరోగ్యం బాగుంటుంది. బాదం, వాల్ నట్స్, పిస్తా, అవి సె జింజలు మొదలైన నట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ బాగా అందుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్‌ను తప్పకుండా తీసుకోండి. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. HDL కొలెస్ట్రాల్ పెంచుతుంది. పసుపులో యాంటీ ఇంప్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడార్ వెనిగర్ ఒక గ్లాస్ నీళ్లలో వేసి రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.