జంతువుల కొవ్వు తినడం వల్ల కలిగే లాభాలు అండ్ నష్టాలు ఏంటో తెలుసా..!
హెల్త్ కు కూడా మంచిది కాదని తాజాగా కార్డియాలజిస్టులు తెలిపారు. జంతువుల కొవ్వుతో నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... జంతువుల కొవ్వు తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కొవ్వులో సంతృప్త కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను భారీగా పెంచి ... ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. గుండె అండ్ ఇతర ఆర్గాన్స్ లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. అలాగే కాలేయ పని తీరు దెబ్బతింటుంది. రెడ్ మీట్ లో కూడా సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి.
దీన్ని ఎక్కువగా తింటే మాత్రం దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ ప్రాబ్లెమ్స్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఫిష్ ఆయిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యం పై సానుకూల ప్రభావం చూపిస్తుంది. దీన్ని డైరెక్ట్ తీసుకుంటే హెల్త్ కు మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెడు కొవ్వును కరిగించడంలో మేలు చేస్తుంది. గుండెకు సంబంధించి ఫిష్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ అందిస్తుంది. దీన్ని షుగర్స్ తో కలిపినప్పుడే హార్ట్ హెల్త్ పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. కాగా గుండె సమస్యలు పెరుగుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.