పలు రకాల స్వీట్ లకు తగ్గట్లు పంచదార పాకం వేసే పద్ధతి ఇదే (కొలతలు - సూత్రాలు)..!
అయితే స్వీట్ రెడీ చేయడానికి పాకం పెట్టాల్సి ఉంటుంది. పంచదార పాకం ఏ స్వీట్స్ కోసం ఎలా పాకం పట్టాలి? కొలతలు, సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... పాకం తయారు చేయాలంటే ముందుగా చక్కెర, వాటర్ ఎంత తీసుకోవాలో సరైన నిష్పత్తిని తీసుకోవాలి. మోతాదులో వాటర్ అండ్ పంచదార తీసుకోకపోతే భాగం సరిగ్గా రాదు. కాగా నీరు, పంచదార కరెక్ట్ గా తీసుకోవటం ముఖ్యం. వీటిని ఒక్కసారి కలిపి మరిగించి పాకం తయారు చేసుకోవాలి. తేలికపాటి పాకాన్ని మైసూర్ పాక్, బూందీ లడ్డు, కొబ్బరి బర్ఫీ, కాజు కత్లో వంటి స్వీట్లను రెడీ చేయడానికి ఎక్కువగా పాకం కడతారు. ఇందుకోసం చక్కెర, వాటర్ సమాన నిష్పత్తిలో తీసుకోవాలి.
షుగర్ కరిగేదాకా మరిగించితే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. లేకపోతే పాకం చెడిపోతుంది. గులాబ్ జామ్ కోసం తీగపాకాన్ని చేస్తారు. చేతితో పాకం పెట్టి సాగదీస్తే తీగ లాగా సాగితే పాకం సరిగ్గా వచ్చినట్లు. ఈ ప్రాసెస్ తర్వాతే స్టవ్ కట్టేయాలి. లేకపోతే గులాబ్ జామ్ తయారీ సరిగ్గా రాదు. నువ్వులు, పల్లీలు, జీడిపప్పు తో చిక్కిలు తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. వీటి తయారీకి కూడా పాకం తప్పనిసరి. చిక్కిలు పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భాగం కాస్త నీళ్లలో వేస్తే అది ఉండ కట్టాలి. లేకపోతే వాటర్ లో చేతిని ముంచి ఆగం కాస్త చేతి వేళ్ల మధ్య తీసుకుని సాగదీస్తే రెండు తీగలు కనిపించాలి. ఇందుకోసం చక్కెర పాకం కొంచెం చిక్కగా అయ్యాక.. 5 మినిట్స్ ఉడికిస్తే చాలు.