ఆలివ్ ఆయిల్ ఎందుకంత ఖరీదు ఉంటుందో తెలుసా..?
ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. WHO సూచించిన దాని ప్రకారం రోజు రెండు టేబుల్ స్పూన్ల లేదా నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ కాలం జీవించే అవకాశాలను పెంచుతుందని వెల్లడించారు. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడంలో, జీవన వ్యవస్థ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడుతుంది.
మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆర్థరైటిస్, క్యాన్సర్,డయాబెటిస్ ప్రమాదాన్ని దరి చేరనివ్వవు. ఆలివ్ ఆయిల్ వాపులను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవుతారు. ఒత్తిడిని తగ్గిస్తుంది. మైండ్ ను యాక్టివ్ గా ఉంచి... మెమొరీ పవర్ను పెంచుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ లోని మినరల్స్, విటమిన్స్ స్కిన్ గ్లోను పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి వర్జిన్ ఆలివ్ ఆయిల్,రెండు రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్, ప్యూర్ ఆలివ్ ఆయిల్.